swami swaroopananda saraswati
-
నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. రాముడు భారతదేశంలో జన్మించాడనేందుకు ఎన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయని వాటిని వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణమని, ఇకనైనా నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. శ్రీరాముని జన్మస్థలం గురించి తెలిసీ తెలియని మాటలు సరికాదని పేర్కొన్నారు.భారత్‌లో జన్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమన్న స్వరూపానందేంద్ర.. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని కొనియాడారు. రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ నేపాల్ ప్రధాని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . -
ఒడిశా సీఎంను కలిసిన స్వామి స్వాత్మనందేంద్ర
-
సీఎం హోదాలో తొలిసారి విశాఖకు
సాక్షి, విశాఖ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు బయల్దేరతారు. పెందుర్తి మండలం చిన్న ముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని వైఎస్ జగన్ సందర్శిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని ఆశీర్వచనం తీసుకోనున్నారు. కాగా భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం శారదా పీఠాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన విషయమై స్వరూపానందేంద్ర స్వామీజీతో చర్చించారు. సనాతన పీఠాల ద్వారానే సమాజంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హిందూ ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగిన పోరాటం చేస్తాం
-
ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి