swamigoud
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారపక్షం తీరుతో ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో ఖూనీ అవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. శాసనమండలిలో కాంగ్రె స్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లేఖ ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు మండలి కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని శుక్రవారం అనూహ్యంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ అందజేసిన నేపథ్యంలో ఉత్తమ్, షబ్బీర్‌లు స్వామిగౌడ్‌ను కలిశారు. పార్టీ మారిన కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రతిపాదనను ఆమోదించవద్దని స్వయంగా చేతిరాతతో కూడిన లేఖను అందజేశారు. రాష్ట్ర శాఖలకు విలీన అధికారం లేదు... ‘నలుగురు సభ్యులు టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. నిజానికి ఈ నెల 20న ఎలాంటి సీఎల్పీ సమావేశం జరగలేదు. వారిచ్చిన లేఖను తిరస్కరించాలి. ఎంఎస్ ప్రభాకర్‌పై రెండేళ్ల నుంచి, దామోదర్‌రెడ్డిపై ఏడాది నుంచి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు విలీనం చేయాలని పిటిషన్ పెట్టారు. ‘తెలం గాణలో ప్రజా స్వామ్యాన్ని రక్షించాలని మేం కోరుతున్నాం. వారిచ్చిన లేఖను తిరస్కరించాలని విన్నవిస్తున్నాం. దీంతోపాటే ఆ నలుగురు ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం’ అని లేఖలో ఉత్తమ్, షబ్బీర్ పేర్కొన్నారు. దీంతోపాటు సమర్పించిన మరోలేఖలో భారత రాజ్యాంగం, గతంలో వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించారు. ‘స్పీకర్ పార్టీలను విలీనం చేయకూడదని భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఇత ర పార్టీలో విలీనం చేసే అధికారాలు భారత జాతీయ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం రాష్ట్ర పార్టీ శాఖలకు లేవు. ఒక జాతీయ పార్టీ ఎప్పటికీ ప్రాంతీయ పార్టీ లో విలీనం కాలేదు. విలీన వినతిని తోసిపుచ్చాల్సిం దే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పేరా 4 ప్రకారం స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించకూడదు. మిగిలి న పేరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం ఉత్తమ్, షబ్బీర్ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయికి తీసుకెళతాం: షబ్బీర్ అలీ పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తామిచ్చిన లేఖలపై నిర్ణయం చేయకుండా, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ కోరగానే చైర్మన్ వెంటనే స్పందించారని షబ్బీర్ అలీ అన్నారు. పార్టీ ఫిరాయించినవారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని ప్రశ్నిం చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. సరిగా స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తామన్నారు. మరో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇదొక విచిత్రమైన పరిస్థితి అని, విలీన అంశం నైతికమా? అనైతికమా? అనే దానిని నాయకులే చెప్పాలన్నారు. ఆ లేఖ వెనుక ఎవరున్నారో గమనించాలి: ఉత్తమ్ శాసనమండలిలోని కాంగ్రెస్ఎల్పీని టీఆర్ఎస్లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు సభ్యులు లేఖ ఇవ్వడం తెలంగాణ సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎలాంటి సీఎల్పీ భేటీ కాకుండా, అసలు కాంగ్రెస్‌లో లేనివాళ్లు విలీనలేఖను ఎలా ఇస్తారని ప్రశ్నిం చారు. నలుగురు ఎమ్మెల్సీలు సమర్పించిన లేఖ వెనుక ఎవరున్నారో తెలం గాణ సమాజం గమనించాలన్నారు. ఆకుల లలిత, సంతోష్‌కు సీఎల్పీ మీటింగ్ పెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. చైర్మన్ న్యాయబద్ధంగా వ్యవహరించి మండలి ప్రతిష్టను కాపాడాలని కోరారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ప్రభాకర్, దామోదర్‌రెడ్డిల వినతికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ సానుకూలంగా స్పందించి వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ బులిటెన్ జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలసి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతోందో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలనే భావనలో ఉంది. దీనిపై శనివారం పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీయై చర్చిస్తారని, అనం తరం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మేధావులకు నిలయం మండలి: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: అన్నిరంగాల మేధావులకు నిలయం శాసనమండలి అని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. ఒడిశాలో శాసనమండలి ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రి నృసింగ చరణ్‌సాహూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమ వారం రాష్ట్ర శాసనమండలిని పరిశీలించింది. వీరికి మండలి ప్రాముఖ్యత, నియమాలు, పని తీరు, వసతుల గురించి స్వామిగౌడ్ వివరించా రు. ఉపాధ్యాయ, పట్టభద్రుల, సామాజిక, రాజ కీయ, మేధాసంపత్తి తదితర రంగాల సమస్య లు, అనుభవాల గూర్చి అర్థవంతమైన చర్చ జరి గే అవకాశం మండలిలో ఉంటుందన్నారు. దేశం లోని 7 రాష్ట్రాల్లో మండలి ఉందని, అన్ని రాష్ట్రా ల్లో మండలి ఏర్పడితే అన్నిరంగాలపై సవివరంగా చర్చించే అవకాశం ఉంటుందన్నారు. ఒడిశా బృందానికి అన్ని వివరాలను శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు వివరించారు. -
'పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పర్యాటక కేంద్రాలను పరిచయం చేసి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ తెలిపారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకుని నగరంలోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం తెలియజె ప్పాలని సూచించారు. రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేపట్టిందని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే పాఠశాల విద్యార్థులకు సబ్సిడీ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను మంత్రి, శాసనమండలి చైర్మన్ అందజేశారు. -
న్యూయార్క్‌లో బతుకమ్మ సంబరాలు
అమెరికాలోని న్యూయార్క్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న స్వామిగౌడ్‌ను టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు ఏనుగు లక్ష్మన్ సాదరంగా ఆహ్వానించారు. 'ఆశామయి హిందూ టెంపుల్ అండ్ కన్వెన్షన్ సెంటర్'లో నిర్వహించే ఈ బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
రాజకీయలబ్ధికే బాబు పాకులాట: టీఆర్ఎస్
హైదరాబాద్: రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబు పాకులాడుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో వార్‌రూమ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా శనివారం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాలని, రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతున్న ఈ తరుణంలో పరస్పర విమర్శలకు పోకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. యుద్ధాలు చేయడానికి వార్‌రూమ్ కాదని, ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికి, సమస్యలను పరిష్కరించడానికి అని స్వామిగౌడ్ వివరించారు. అన్నిరంగాల ఉద్యోగస్తుల సమాచారాన్ని వార్రూముకు పంపించాలని ఆయన కోరారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ మీద పెత్తనం చెలాయిస్తామంటే రెచ్చగొట్టడం కాదా? అని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని సూచించారు. విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలోని వారు అదే రాష్ట్రంలో పనిచేయాలన్నారు. జోనల్ పోస్టుల్లోనూ ఉల్లంఘనలు: శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రకేడర్ పోస్టుల్లోనే కాకుండా జోనల్ పోస్టుల్లోనూ అనేక ఉల్లంఘనలు జరిగాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులు పోరాడింది ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలని తప్ప ఇతరుల కోసం కాదన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనాన్ని ఎలా అంగీకరిస్తామన్నారు. అవకతవకలపై శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ మహంతిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఓపెన్ కేటగిరిలో తెలంగాణ వారికి ఉద్యోగాలివ్వకుండా.. మెరిట్ వచ్చినప్పటికీ వారిని స్థానిక కోటాలోనే నియమించారని.. దీనివల్ల సీమాంధ్రులు ఎక్కువగా ఇక్కడ ఉద్యోగాలు పొందారన్నారు. తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించామని, కాని విభజన కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని వాపోయారు.