swaroopa
-
Aadi Swaroopa: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
-
లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్లో రీ షేర్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నెటిజన్ల ప్రశంసలు ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్’ హిందీ సినిమాలో ‘వైరస్’పాత్ర చేసిన బొమన్ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. బహుముఖ ప్రతిభ ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. పాకిస్తాన్ బౌలర్ రికార్డు రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్ బౌలర్ యాసిర్ జాన్ 2017లో గిన్నీస్ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు. -
వివాహిత అదృశ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని దేవులపల్లిలో వివాహిత అదృశ్యమైనట్లు స్థానిక ఎస్ఐ రాజశేఖర్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి విఠ్లల్ కూతురు స్వరూప వివాహం ఎనగండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి పోచయ్యతో ఆరేళ్లక్రితం జరిగింది. ప్రస్తుతం ఒక కొడుకు ఉన్నారు. కాగా గత పదిహేను రోజుల క్రితం స్వరూప తల్లిదండ్రులను చూసేందుకు దేవులిపల్లి గ్రామానికి వచ్చింది. మే 30వ తేది అర్ధరాత్రి ఇంట్లోనుండి వెల్లిపోయింది. ఉదయం తండ్రిలేచి చూడగా ఇంట్లోలేదు. దీంతో చుట్టుపక్కల, బందువుల వద్దవెతికిన ఆచూకీలభించలేదు. దీంతో విఠల్ ఫిర్యాదు మేరకు స్వరూప అదృశ్యమైనట్లు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో స్వరూప్ రావల్
లండన్: భారత్‌కు చెందిన నటి, ఉపాధ్యాయురాలు స్వరూప్ రావల్ వర్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో టాప్ 10 ఫైనలిస్టులో స్థానం సంపాదించారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా భారతీయ సమాజంలోని పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు చేసిన కృషికి గాను ఆమె పేరు జాబితాలో చేర్చారు. స్వరూప్ ప్రస్తుతం గుజరాత్‌లోని లావడ్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 వేల నామినేషన్ల నుంచి ఆమె పేరు ఎంపిక కావడం విశేషం. వచ్చే నెల దుబాయ్‌లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫోరమ్ (జీఈఎస్ఎఫ్) విజేతకు ఈ అవార్డును అందజేయనుంది. విజేతకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. మాజీ మిస్ ఇండియా, ప్రముఖ నటుడు పరేష్ రావల్ సతీమణి కూడా అయిన స్వరూప్ రావల్ టాప్ 10 జాబితాలో చోటు దొరికినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘చాలా కొద్ది మంది మాత్రమే టీచర్ల ప్రతిభను, కష్టాన్ని గుర్తిస్తున్నారు. విద్యను బోధించడం నిజంగా సవాల్ లాంటిదే. ఈ ప్రయాణంలో ప్రతి విజయాన్ని వేడుకగా చేసుకోవాల్సిందే అని నేను నమ్ముతాను. నాతోపాటు అవార్డు రేసులో నిలిచిన వారికి, నిలవని వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను’అని స్వరూప్ అన్నారు. -
స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత
-
‘తన్విత’ను దక్కించుకున్న స్వరూప
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది. ఓ వైపు కన్నపేగు, మరోవైపు పెంచిన మమకారం... తన్విత కోసం ఇద్దరు తల్లులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. చివరకు పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకూ స్వరూప వద్దే తన్విత ఉండాలని కొత్తగూడెం 5వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన రోజు నుంచి తన్విత తనవద్దనే పెరిగిందని స్వరూప కోర్టులో తన వాదనలు వినిపించింది. మరోవైపు తన్విత కన్నతల్లి ఉమ సమర్పించిన అఫిడవిట్ పరిశీలించిన అనంతరం కోర్టు పెంపుడు తల్లికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ప్రస్తుతం ఖమ్మం బాలల సదనం ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి తన్విత ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు. బాగా చూసుకోవడం లేదనే భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకే అప్పగింత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఖమ్మం గృహంలో ఉన్న తన్వితను పెంపుడు తల్లి స్వరూపకు అప్పగించారు. -
జేసీ దివాకర్‌రెడ్డికి ఝలక్
-
జేసీ నల్లద్దాలు తీసేసి తెల్ల అద్దాలు పెట్టుకో
సాక్షి, అనంతపురం : అనంతపురం టీడీపీలో మరోసారి వర్గపోరు తెరపైకి వచ్చింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడని అనంతపురం నగర మేయర్ స్వరూప నిప్పులు చెరిగారు. వంద కోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా నల్ల అద్దాలు పెట్టుకున్న దివాకర్ రెడ్డికి అవి కనిపించవని, ఆయన వెంటనే నల్ల అద్దాలు తీసి తెల్ల అద్దాలు పెట్టుకోవాలని సూచించారు. బుధవారం స్వరూప మీడియాతో మాట్లాడుతూ చుట్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనులను కన్నెత్తి చూడకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంపీ జేసీ ఆయన కేవలం తిలక్‌రోడ్, సూర్యనగర్ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్ ఎద్దేవా చేశారు. అనంతపురం పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరిస్తున్న జేసీ నగర అభివృద్ధికి ఇంతవరకూ అర్ధరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడటం మాని ఇప్పటికైనా మంచి పనులుచేసి రాజకీయాలకు గుడ్‌బై చెబితే మంచిదని సలహా ఇచ్చారు. -
మంగళగిరి ఆసుపత్రిలో దారుణం
-
మంగళగిరి ఆసుపత్రిలో దారుణం
సాక్షి, గుంటూరు: మంగళగిరి పట్టణంలోని ఓ ఆసుపత్రి దారుణానికి ఒడిగట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన ఓ యువతి మృతి చెందినా.. ఆమెకు రెండు రోజుల పాటు వైద్యం చేసినట్లు నటించిన ఘటన ఠాగూర్ సినిమాను గుర్తుకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్వరూప అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమెను హుటాహుటిన మంగళగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీళ్లతో ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స చేస్తున్నామని స్వరూప ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు భరోసానివ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల అనంతరం స్వరూప చనిపోయిందని, మిగిలిన డబ్బు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దీంతో నిర్గాంతపోయిన స్వరూప కుటుంబసభ్యులు ఆసుపత్రి తమను మోసం చేసిందని ఆరోపించారు. స్వరూప ముందే మరణించినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా వైద్య అవసరాలకు రూ.1.50 లక్షలు గుంజారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని చెప్పారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రాధిక షాద్‌నగర్ క్రైం/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: పిండి నేలపై పారబోసిందని క్షణికావేశంలో కన్నకూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలిక మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడకి చెందిన చెన్నయ్య, స్వరూప దంపతులు గత శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడుతున్నారు. అప్పుడే వీరి చిన్న కుమార్తె రాధిక (9) రొట్టెల పిండిని తీసుకొస్తూ కింద పడేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి స్వరూప కూతురి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గ్రామస్తులు రాధికను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన రాధిక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మంగళవారం రాధిక మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఆ తల్లిపై హత్యకేసు పెట్టాలి: బాలల హక్కుల సంఘం క్షణికావేశంలో కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించి మరణానికి కారణమైన తల్లి స్వరూపపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరికొన్ని ఇళ్లల్లో.. రాధిక లాగే మిగిలిన పిల్లలకు రక్షణ లేదని, తల్లిదండ్రుల నుంచి వారికి ప్రాణాపాయం పొంచి ఉందన్న అభిప్రాయాన్ని ఆ సంఘం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించి వారి బాగోగులు చూసుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.