
సాక్షి, అనంతపురం : అనంతపురం టీడీపీలో మరోసారి వర్గపోరు తెరపైకి వచ్చింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున‍్న రాక్షసుడని అనంతపురం నగర మేయర్ స‍్వరూప నిప్పులు చెరిగారు. వంద కోట‍్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా నల‍్ల అద్దాలు పెట్టుకున‍్న దివాకర్ రెడ్డికి అవి కనిపించవని, ఆయన వెంటనే నల‍్ల అద్దాలు తీసి తెల‍్ల అద్దాలు పెట్టుకోవాలని సూచించారు. బుధవారం స‍్వరూప మీడియాతో మాట్లాడుతూ చుట‍్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనులను కన్నెత్తి చూడకుండా విమర‍్శలు చేస్తున్నారన్నారు.
ఎంపీ జేసీ ఆయన కేవలం తిలక్‌రోడ్, సూర‍్యనగర్ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్ ఎద్దేవా చేశారు. అనంతపురం పార‍్లమెంట్ సభ‍్యునిగా వ‍్యవహరిస్తున‍్న జేసీ నగర అభివృద్ధికి ఇంతవరకూ అర‍్ధరూపాయి కూడా ఖర్చు పెట‍్టలేదని విమర్శించారు. తాము చేస్తున‍్న అభివృద్ధి పనులకు అడ్డుపడటం మాని ఇప్పటికైనా మంచి పనులుచేసి రాజకీయాలకు గుడ్‌బై చెబితే మంచిదని సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment