SWAYAM
-
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది..
యాభై ఆరేళ్ల కమలా హ్యారిస్ ఎక్కడ?! 2009 బ్యాచ్ స్వయం భాటియా ఎక్కడ?! ‘బట్.. నేను, తను ఒక్కటే. మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడీ పన్నెండేళ్ల వయసులో ఒక ఇండియన్ గా యూఎస్ లో నేను ఎలా ఉన్నానో, తన టీన్స్ ఆరంభంలో కమల అలానే ఉన్నారు‘ అంటోంది ఈ ‘స్వయం’భువు! ఇంతకీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఏదైనా చేస్తుండే వయసా ఇది! చేసి పెడుతుంటే, తిని పెడుతుండే ఏజ్ కదా! కానీ స్వయం భాటియా అలా లేదు. షి ఈజ్ ఏన్ యాక్ట్రెస్. సింగర్, డాన్సర్, మోడల్, డ్రమ్మర్.. ఇంకా చాలా! వైస్–ప్రెసిడెంట్ అనే ఆ పోస్టును తీసి పక్కన పెడితే.. నిజమే, నేనూ తానూ అనేంత ఉంది ‘స్వే’కి. అకస్మాత్తుగా ఈ పిడుగు ఎక్కడ నుంచి పడింది?! ఈ చిన్నారిని చూశారుగా! పేరు స్వే భాటియా. వయసు పన్నెండేళ్లు. ఆ వయసుకు ఎంత పేరొచ్చినా స్వే భాటియా అనే పేరు తర్వాతనే. కానీ తను ‘మైటీ డక్స్ యాక్ట్రెస్’ అనే పేరుతో యూ ఎస్‌లో పాపులర్. న్యూయార్క్ సిటీలో ఉంటుంది. చదువు చదువే. టాలెంట్ టాలెంటే! నటనొక్కటే టాలెంట్ అనుకునేరు. సింగర్, డ్యాన్సర్, మోడల్, డ్రమ్మర్, ఇంకా.. కమెడియన్. అంత టైమ్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం. తను మాత్రం వేరేలా అంటుంది.. ‘బోర్ కొడుతోంది మమ్మీ.. టైమ్ గడవడం లేదు’ అని! టైమ్ కంటే వేగం అయి ఉండాలి. అంత వేగామా.. అని ఇప్పటికప్పుడు మీరు స్వేని చూడాలనుకుంటే హెచ్.బి.వో.లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్లాక్ కామెడీ సెటైరికల్ డ్రామా సీరీస్.. ‘సక్సెషన్’ కోసం టీవీ ఆన్ చేయొచ్చు. అందులో సోఫీ రాయ్‌గా మీకు కనిపించబోయేది స్వే భాటియానే! లేకుంటే మార్చి 26న ప్రారంభమయ్యే ‘డిస్నీ ప్లస్’ సీక్వెల్ సీరీస్ ‘ది మైటీ డక్స్ : గేమ్ ఛేంజర్’ కోసం ఎదురు చూడొచ్చు. మైటీ డక్స్ విడుదలకు ముందే స్వే.. మైటీ డక్స్ యాక్ట్రెస్ అయిందంటే చూడండి. సరే, ఇప్పటి వరకు ఇదంతా స్వే (అసలు పేరు ‘స్వయం’) గురించి మనం చెప్పుకున్నది. ఇక్కడి నుంచి స్వే తన గురించి తను చెప్పుకోబోతున్నది! అయితే స్వే ఊరికే తనేమిటో చెప్పుకోవడం లేదు. కమలా హ్యారిస్‌తో తనని కంపేర్ చేసుకుంటోంది. లేదంటే కమలా హ్యారిన్ని తనతో కంపేర్ చేస్తోంది! ఇలాగని తను తన బ్లాగ్‌లో రాసుకుంది. డ్రమ్మర్‌గా, నటిగా, మోడల్‌గా స్వే (స్వయం) ‘‘ఐ యామ్ స్వే. పుట్టినప్పుడు స్వయం రంజీత్ భాటియా నేను. ఈ మధ్యే నేను నా పేరులో ఉన్న పవర్‌ని గమనించాను. ‘స్వ’ అంటే ‘నా’ అని. ‘స్వయం’ అంటే ‘నేను’ అని. నేను పుట్టకముందే అమ్మానాన్న అబ్బాయి పుడితే పెట్టాలని ‘స్వీయ’ అనే అర్థంలో ‘స్వయం’ అనే సంస్కృత నామాన్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. నేను పుట్టాక అదే పేరు ఉంచేశారు’’ అని స్వే తన బ్లాగులో రాసుకుంది. అయితే ఇదేమీ విషయం కాదు. తన పేరులో ఉన్న పవరే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరులోనూ ఉందని తను గమనించిందట. అంతే కాదు, తామిద్దరికీ పోలికలు ఉన్నాయని కూడా! కమలానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నట్లే కమలా హ్యారిస్ ప్రయాణానికీ ఉంటుందని అనిపించి ఆమె గురించి తెలుసుకున్నా. భారతీయ సంతతి అమెరికన్ టీనేజర్‌గా కమల అమెరికాలో ‘ఏకాకి’ అయిన సందర్భాలు.. నేను ఇప్పుడు ఏకాకి అవుతున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాయి. ఆ వయసులో ఒక బ్లాక్ పర్సన్‌గా, ఒక ఇండియన్‌గా, ఒక మహిళగా తన గదిలో కమల ఒంటరిగా గడపడం.. ఇప్పుడు నా ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తోంది. నేను టీన్స్‌లోకి వస్తున్నాను. పదమూడు రాబోతోంది. నాకూ నా గదిలో ఒంటరి ఇండియన్ని అనిపిస్తుంటుంది. బ్యాలే క్లాస్‌లో, హిప్ హాప్ డ్యాన్స్ కచ్చేరీల్లో, బ్రాడ్వే ఆడిషన్లలో నేనొక్కదాన్నే అన్నట్లు ఉంటుంది. గత ఏడాది కమల పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆమెతో నన్ను పోల్చుకున్నాను. ఆమె అడుగు కదిలినప్పుడు నా అడుగు కదలినట్లు, క్యాపెయిన్ను ఆపినప్పుడు నా అడుగు ఆగినట్లు ఊహించుకున్నాను. ఒకవేళ ఆమె ఇక్కడే ఆగిపోతే.. నేనూ ఆగిపోతానా అనే ఆలోచన కూడా నాకు ఆనాడు వచ్చింది. కానీ ఆమె గెలిచారు. నాలో గెలుపు ఆలోచనలు కలిగించారు. ఒక ఇండియన్ అమెరికన్ ఇంత ఘన విజయం సాధించారు కనుక నేనూ సాధిస్తాను అనుకున్నాను’’ అని స్వే తన బ్లాగ్‌లో రాసింది. ఇదంతా స్వే మామూలుగా రాసుకున్నదే కానీ ఆమె ఇలా రాయడానికి ఇప్పుడు అనుకోని ప్రాధాన్యం లభిస్తోంది. ముఖ్యంగా కమలా హ్యారిస్‌తో ‘నేనూ తనూ’ అని పోల్చుకోవడం! యాక్టర్స్ ఈక్విటీ అసోసియేషన్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్ సంస్థలతో స్వేకి కాంట్రాక్టులు ఉన్నాయి. అసలు మూడేళ్ల వయసు నుంచే స్వే సంగీత, సృజనాత్మక రంగాలలోకి వచ్చేసింది. కీబోర్డ్, క్లాసికల్ పియానో, బాస్ గిటార్, డ్రమ్.. ఆమె వేళ్లు చెప్పినట్లు రాగాలు పోతాయి. దరువులు వేస్తాయి. స్వే డ్యాన్స్ చేస్తే ఫ్లోర్ పరవశించిపోవలసిందే! అంత లయబద్ధంగా చేస్తుంది. ‘‘తను ప్రధానంగా నటి. డాన్స్, సంగీతం.. తనకు అనుబంధ ఆసక్తులు’’ అంటారు స్వే తల్లిదండ్రులు రంజీత్, ధర్మాంగి. చివరికి స్వే ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా ఎదిగి, రాజకీయాల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. కమలతో తనను కంపేర్ చేసుకుంటోందంటే.. కమల అడుగు జాడల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉందనేగా! -
ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు
న్యూఢిల్లీ: సామూహిక ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (మూక్) ప్లాట్‌ఫామ్ ‘స్వయం’ను ఆగస్టు 15న ప్రారంభించాలని మానవ వనరుల శాఖ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, పంద్రాగస్టున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంఛనంగా ఆరంభించే అవకాశం ఉందని శాఖ వర్గాలు తెలిపాయి. సమాచార సాంకేతికతతో నడిచే వ్యవస్థ ‘స్వయం’లో 2 వేలు పైబడిన కోర్సులు 3 కోట్ల మంది విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. 9-12 తరగతుల నుంచి డిగ్రీ , పీజీ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఒకేసారి 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునేలా సాయపడే నె ట్‌వర్క్ దీనిలో భాగం కానుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే రెండున్నర లక్షల గంటల పైబడిన ఈ-సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పాఠ్యాంశ వనరుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ కోర్సుల ద్వారా సాధించిన క్రెడిట్లు విద్యార్థుల కాలేజీలు, పాఠశాలలకు పంపిస్తారు. -
SWAYAM కు శ్రీకారం.. ఆన్లైన్లోనే యూఎస్ పీజీ కోర్సులు
ఎడ్యు పాలసీ స్టడీ అబ్రాడ్ అనగానే భారత విద్యార్థులకు గుర్తొచ్చే అమెరికా యూనివర్సిటీలు.. అవి అందించే కోర్సులు ఇక మన దేశం నుంచే అభ్యసించేందుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు భారత్, అమెరికాల మధ్య సంయుక్త ఒప్పంద పథకం SWAYAM(స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ - లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. రెండు ప్రభుత్వాల సంయుక్త ఒప్పందం ద్వారా రూపకల్పన జరిగిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం ‘స్వయం’ ద్వారా అమెరికా యూనివర్సిటీలు భారత విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేయొచ్చు. దీనివల్ల విదేశీ విద్య స్వప్నం సాకారం కావడంతోపాటు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నిలిచిన యూఎస్ యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు సొంతం చేసుకునే అవకాశం భారత విద్యార్థులకు లభిస్తుంది. అదేవిధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ల మధ్య ఉన్నత విద్య ప్రమాణాల పెంపు విషయంలో జరిగిన కొత్త ఒప్పందం గ్లోబల్ ఇనీషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్స్ (GIAN)కూడా ఆమోదం పొందింది. దీని ప్రధాన ఉద్దేశం శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్స్ భారత్‌లో ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పని చేసి నాణ్యత ప్రమాణాలు పెంచడం.