ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు | PM Narendra Modi to launch Swayam, Massive Open Online Courses platform on Aug 15 | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు

Published Mon, Jul 4 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు

ఆన్‌లైన్‌లో ఫ్రీ కోర్సులు

న్యూఢిల్లీ: సామూహిక ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (మూక్) ప్లాట్‌ఫామ్ ‘స్వయం’ను ఆగస్టు 15న ప్రారంభించాలని మానవ వనరుల శాఖ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, పంద్రాగస్టున్న ప్రత్యేక  కార్యక్రమంలో  ప్రధాని  మోదీ లాంఛనంగా ఆరంభించే అవకాశం ఉందని  శాఖ వర్గాలు  తెలిపాయి. సమాచార సాంకేతికతతో నడిచే వ్యవస్థ ‘స్వయం’లో 2 వేలు పైబడిన కోర్సులు 3 కోట్ల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

9-12 తరగతుల నుంచి డిగ్రీ , పీజీ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఒకేసారి 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునేలా సాయపడే నె ట్‌వర్క్ దీనిలో భాగం కానుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే రెండున్నర లక్షల గంటల పైబడిన ఈ-సమాచారం అందుబాటులోకి వస్తుంది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్   పాఠ్యాంశ వనరుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ కోర్సుల ద్వారా సాధించిన క్రెడిట్లు విద్యార్థుల కాలేజీలు, పాఠశాలలకు పంపిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement