SWAYAM కు శ్రీకారం.. ఆన్‌లైన్‌లోనే యూఎస్ పీజీ కోర్సులు
ఎడ్యు పాలసీ
స్టడీ అబ్రాడ్ అనగానే భారత విద్యార్థులకు గుర్తొచ్చే అమెరికా యూనివర్సిటీలు.. అవి అందించే కోర్సులు ఇక మన దేశం నుంచే అభ్యసించేందుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు భారత్, అమెరికాల మధ్య సంయుక్త ఒప్పంద పథకం SWAYAM(స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ - లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.
రెండు ప్రభుత్వాల సంయుక్త ఒప్పందం ద్వారా రూపకల్పన జరిగిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం ‘స్వయం’ ద్వారా అమెరికా యూనివర్సిటీలు భారత విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేయొచ్చు. దీనివల్ల విదేశీ విద్య స్వప్నం సాకారం కావడంతోపాటు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నిలిచిన యూఎస్ యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు సొంతం చేసుకునే అవకాశం భారత విద్యార్థులకు లభిస్తుంది.
అదేవిధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌ల మధ్య ఉన్నత విద్య ప్రమాణాల పెంపు విషయంలో జరిగిన కొత్త ఒప్పందం గ్లోబల్ ఇనీషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్‌వర్క్స్ (GIAN)కూడా ఆమోదం పొందింది. దీని ప్రధాన ఉద్దేశం శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్స్ భారత్‌లో ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పని చేసి నాణ్యత ప్రమాణాలు పెంచడం.