Swaziland
-
బళ్లారిలో పర్యటించిన స్వాజీలాండ్ ప్రధాని
భారత దేశ పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం స్వాజీలాండ్‌కు చెందిన ప్రధానమంత్రి బర్నబాస్ సిబూసిసోద్లామిని బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన 10 గంటలకు బళ్లారి జిల్లా తోరణగల్లు జిందాల్ విమానాశ్రయం చేరుకున్నారు. జిందాల్ సీఈఓ డాక్టర్ వినోద్ నావెల్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆ దేశ ఆర్థిక, ప్రణాళికాభివృద్ధి శాఖ మంత్రి ప్రిన్స్ లాంగ్ సెంపీ గ్లామిని, వ్యవసాయశాఖ మంత్రి మోసస్ మాలిండేన్ మిలాకటి, సెనేటర్ జెబులిలా మషోమా తదితర మంత్రులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం బర్నబాస్ సిబూసిసోద్లామిని జిందాల్ ఆవరణంలోని కళాధామం సందర్శించారు. హంపికి సంబంధించిన చిత్రాలను, వాటి అందాలను వీడియో క్యాసెట్లను తిలకించారు. -
'ఇది చరిత్రలో నిలిచే ఘట్టం'
న్యూఢిల్లీ: భారత్-ఆఫ్రికా ఫోరం మధ్య జరుగుతున్న సమావేశం ఒక చరిత్రాత్మక సంఘటన అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. 'ఇండియా ఆఫ్రికా ఫోరం మూడో సదస్సు చరిత్రలు నిలిచిపోయే కార్యక్రమం' అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. గత మంగళవారం రాత్రి స్వాజిలాండ్ రాజు ఎంఎస్ వాతి 3ని సాధర స్వాగతం పలికారు. భారత్‌లో తొలిసారి జరుగుతున్న సదస్సుకు వివిధా ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులను గౌరవప్రదంగా ఆహ్వానించడాన్ని సంతోషంగా భావిస్తుందని ఈ సందర్భంగా ముఖర్జీ అన్నారు. అనంతరం భారత్ దేశ ఔన్నత్యాన్ని చాటేలా దేశంలోని విలువలను, సాంప్రదాయాలను, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను గుర్తు చేయడంతోపాటు స్వాజిలాండ్తో బంధాన్ని అభివర్ణించారు. గత కొన్నేళ్లలోనే స్వాజిలాండ్ తో తమ అనుభందం ఎంతో పెనవేసుకుందని, ఇది ఇంకా బలపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వ డిమాండ్ కు స్వాజిలాండ్ కూడా మద్దతిచ్చిన విషయం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ దేశ రాజు ఎంఎస్ వతి కూడా మాట్లాడుతూ తమకు భారత్ అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరారు. భారత్ నుంచి తాము ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నామని చెప్పారు. తమ లక్ష్యాలను, ఆర్థిక పురోగతిని సాధించడాని తాము భారత్ సాయం ఎప్పటికీ తీసుకుంటూనే ఉంటామన్నారు. -
ప్రమాదంలో 38 మంది బాలికల మృతి
జోహన్నెస్‌బర్గ్: స్వాజిలాండ్ దేశంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది బాలికలు, ఒక యువతి చనిపోగా, 20 మంది గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎంబబానే నుంచి మంజీనీకి వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టింది. బాలికలు, యువతులు స్వాజిలాండ్ రాజభవనంలో జరిగే నృత్య వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ వేడుకలో రాజు యువతుల్లో ఒకరిని భార్యగా స్వీకరిస్తారు.