భారత దేశ పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం స్వాజీలాండ్‌కు చెందిన ప్రధానమంత్రి బర్నబాస్ సిబూసిసోద్లామిని బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పర్యటించారు.
భారత దేశ పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం స్వాజీలాండ్‌కు చెందిన ప్రధానమంత్రి బర్నబాస్ సిబూసిసోద్లామిని బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన 10 గంటలకు బళ్లారి జిల్లా తోరణగల్లు జిందాల్ విమానాశ్రయం చేరుకున్నారు.
జిందాల్ సీఈఓ డాక్టర్ వినోద్ నావెల్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆ దేశ ఆర్థిక, ప్రణాళికాభివృద్ధి శాఖ మంత్రి ప్రిన్స్ లాంగ్ సెంపీ గ్లామిని, వ్యవసాయశాఖ మంత్రి మోసస్ మాలిండేన్ మిలాకటి, సెనేటర్ జెబులిలా మషోమా తదితర మంత్రులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం బర్నబాస్ సిబూసిసోద్లామిని జిందాల్ ఆవరణంలోని కళాధామం సందర్శించారు. హంపికి సంబంధించిన చిత్రాలను, వాటి అందాలను వీడియో క్యాసెట్లను తిలకించారు.