బతికున్న వ్యక్తిని 'చంపేసిన' పేపర్!!
ఆయన వయసు 81 ఏళ్లు. పొద్దున్నే పేపర్ చదవడం ఆయనకు బాగా అలవాటు. అందులో భాగంగానే ఒకరోజు పేపర్ తీసుకున్నారు. అందులో తీరా చూసేసరికి.. తాను చనిపోయినట్లు వార్త ప్రచురితమై ఉంది. అంతే.. దెబ్బకు ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన స్వీడన్లో జరిగింది. స్వెన్ ఒలోఫ్ స్వెన్సన్ అనే వ్యక్తికి క్రిస్మస్ రోజు నుంచే అనారోగ్యంగా ఉండటంతో దక్షిణ స్వీడన్‌లోని ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. ఆయన చెల్లెలు వైద్యులతో ఫోన్లో మాట్లాడగా, ఆయన చెప్పింది విని తన అన్న చనిపోయాడని అనుకుంది. దాంతో ఆయన చనిపోయినట్లు పత్రికలో ప్రకటన ఇచ్చేసింది.
కానీ, స్వెన్సన్ స్నేహితుడు ఆ ఆస్పత్రికి అదేరోజు వెళ్తే.. ఈయన భేషుగ్గా మంచం మీద కూర్చుని కనిపించాడు. అదేంటి, నువ్వింకా చచ్చిపోలేదా అనుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. వెంటనే పెద్దాయన పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి, తానింకా బతికే ఉన్నానని కూడా చెప్పారు. పత్రికలో జరిగిన పొరపాటును తేలిగ్గా తీసుకుని, మర్నాడు సవరణ వేయాల్సిందిగా కోరడంతో పాటు రిపోర్టర్‌ను కూడా పంపమని అడిగారు.