Sweeper Post
-
స్వీపర్ కొలువుకు ఎంబీఏ, బీటెక్ గ్రాడ్యూయేట్లు
చెన్నై : దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతుంది. లక్షల్లో యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివి.. కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ అయిన లక్షల్లో అప్లై చేస్తారు. చదివిన చదువుకు, కొలువుకు సంబంధం ఉండటం లేదు. ఆఖరికి స్వీపర్ పోస్టు కోసం వందల్లో పట్టభద్రులు అప్లై చేశారంటే.. నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో స్వీపర్, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివిన వారు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో... అధికారులు సైతం అవాక్కయ్యారు. -
స్వీపర్ పోస్టును లాక్కుంటున్నారు
* అధికార పార్టీ నేతలపై ఫిర్యాదుల వెల్లువ * గ్రీవెన్స్‌సెల్‌కు 232 ఫిర్యాదులు విజయనగరం కంటోన్మెంట్: నిరుపేదనైన తనను పాఠశాల స్వీపర్‌గా నియమించుకోమని గ్రామైక్య సంఘం శానిటరీ రిపోర్టు పంపిస్తే తనను కాకుండా..ఏ అర్హతలూ లేని మరొకరిని నియమించారని కొమరాడ మండలం కందివలసకు చెందిన బచ్చల భవాని అధికారుల ముందు వాపోయింది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 232 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్రలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బచ్చల భవాని మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు వచ్చిన స్వీపర్ పోస్టును తనకు కాకుండా చేసేందుకు నాయకులు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారని దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదులో పొందుపరిచింది. తనకు న్యాయం చేయాలని కోరింది. భూములను ఇవ్వడం లేదు 30 ఏళ్ల క్రితం బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన 14 మంది దళితులకు నాలుగెకరాల చొప్పున ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమకు కాకుండా చేస్తున్నారని గ్రామానికి చెందిన కురమాన పైడియ్య, రాయి వెంకయ్య, గర్భాపు చిన్నమ్మి, కాగాన సింహాచలం తదితరులు ఫిర్యాదు చేశారు. గొర్లె సీతారాం పురంలో తమకు కేటాయించిన భూమిని వెంటనే ఇప్పించాలని కోరారు. కోళ్ల ఫారాలతో దుర్గంధం పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామం చుట్టూ ఇప్పటికే పెద్ద పెద్ద కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి ఉండడం వల్ల తీవ్ర దుర్గంధంతో ప్రజానీకం ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు ఎస్సీ కాలనీలో కొత్తగా కోళ్ల ఫారం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని గ్రామానికి చెందిన జి నాగిరెడ్డి, బి రాము తదితరులు ఫిర్యాదు చేశారు. కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరారు. అనుమతిలేని క్రషర్లతో అవస్థలు వేపాడ మండలం రామస్వామి పేటలో అనుమతులు లేకుండా ఏడు క్రషర్లు నడుస్తున్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని నిలిపివేయించాలని గ్రామ సర్పంచ్ పత్రి బాలకృష్ణ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం కిలోమీటరు పరిధిలో ఏడు క్రషర్లనూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా నడుపుతున్నారన్నారు. వీఆర్ఏకు ఎస్సీ కార్పొరేషన్ రుణమిచ్చారు. సీతానగరం మండలం పెదంకలాం గ్రామానికి చెందిన అర్హులు ఎంతో మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రుణాలివ్వని అధికారులు, బ్యాంకర్లు ఓ ప్రభుత్వోద్యోగి అయిన వీఆర్యే పెంటకోట శంకరరావుకు సబ్సిడీ రుణం మంజూరు చేశారని గ్రామానికి చెందిన చింతాడ పైడయ్య ఫిర్యాదు చేశారు. ఇతనికి లోను రద్దు చేయించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.