Sweet Karam Coffee
-
నయా ట్రెండ్ : అమ్మమ్మ చేతి వంట
నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్‌లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్‌లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్. రూ.2000 ల పెట్టుబడిఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది. పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని. నేడు ఎస్కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది. -
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు
ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా 24 కొత్త మూవీస్ విడుదలకు సిద్ధమైపోయాయి. ఈ సోమవారం చూసినప్పుడు 24 సినిమాల లిస్ట్ వచ్చింది. వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇక ఈ శుక్రవారం కోసం మరికొన్ని కొత్తవి యాడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే దాదాపు 24 చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి రానున్నాయని క్లారిటీ వచ్చేసింది. వీటిలో తెలుగు సినిమాలు చాలానే ఉండటం విశేషం. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ అదురా - తెలుగు డబ్బింగ్ సిరీస్ ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ - ఇంగ్లీష్ సిరీస్ చక్రవ్యూహం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) స్వీట్ కారం కాఫీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్) ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ - ఫిలిప్పీన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్సన్ - ఇంగ్లీష్ సిరీస్ టక్కర్ - తెలుగు సినిమా ద ఔట్ లాస్ - ఇంగ్లీష్ మూవీ ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ - ఇంగ్లీష్ చిత్రం హ్యాక్ మై హోమ్ - ఇంగ్లీష్ సిరీస్ గోల్డ్ బ్రిక్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) డీప్ ఫేక్ లవ్ - పోర్చుగీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేక్ అప్ కార్లో - పోర్చుగీస్ సిరీస్ (స్ట్రీమింగ్) ఆహా 3:33 - తమిళ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ IB 71 - హిందీ సినిమా రుద్రమాంబపురం - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 అర్చిర్ గ్యాలరీ - బెంగాలీ సినిమా కతర్భాషా ఎండ్ర ముత్తురామలింగం - తమిళ చిత్రం తర్లా- హిందీ మూవీ సోనీ లివ్ ఫర్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ జియో సినిమా బ్లయిండ్ - హిందీ చిత్రం HR ఓటీటీ అనురాగం - మలయాళ మూవీ ముబీ రిటర్న్ టూ సియోల్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీసులు, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? వాటిని ఎప్పుడు ఎలా చూడాలా అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్లలోకి 10 చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో 'రంగబలి' మాత్రం కాస్త చెప్పుకోదగ్గది. అయితే ఓటీటీల్లోకి మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో తెలుగు మూవీస్-సిరీస్ లు బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో బాబీలోన్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 05 స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) - జూలై 06 అదురా (హిందీ సిరీస్) - జూలై 07 ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) - జూలై 05 IB 71 (హిందీ సినిమా) - జూలై 07 నెట్‌ఫ్లిక్స్ అన్నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) హోమ్ రెకర్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 06 ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 07 ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 07 హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) - జూలై 07 జీ5 అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) - జూలై 07 తర్లా (హిందీ మూవీ) - జూలై 07 జియో సినిమా ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) - జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) బ్లయిండ్ (హిందీ మూవీ) - జూలై 07 ఉనాద్ (మరాఠీ సినిమా) - జూలై 08 సోనీ లివ్ ఫర్హానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 07 హవా (బంగ్లాదేశీ మూవీ) - జూలై 07 ముబీ రిటర్న్ టూ సియోల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 07 (ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్) -
క్రేజీ అడ్వెంచరస్ వెబ్ సిరీస్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా లెక్కకు మించి మన ముందుకు వస్తున్నాయి. అద్భుతంగా అలరిస్తున్నాయి. రెండు గంటల్లో చెప్పలేని కొన్ని కథల్ని పలువురు దర్శకులు.. వెబ్ సిరీసులుగా తీస్తున్నారు. అలా అమెజాన్ ప్రైమ్ మరో క్రేజీ అడ్వెంచరస్ సిరీస్ ని సిద్ధం చేసింది. మూడు జనరేషన్లకు చెందిన మహిళా నటులతో తీసిన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించింది. (ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) 'మురారి' సినిమాలో మహేశ్ బాబుకి తల్లిగా నటించిన లక్ష్మి మనకు తెలుసు. ఎన్నో సినిమాల్లో నటించి మనందరికీ ఫేవరెట్ అయిపోయారు. అలానే 'రోజా'లో హీరోయిన్ గా చేసిన మధుబాల కూడా మనకు పరిచయమే. ఈమె ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరితోపాటు శాంతి అనే మరో అమ్మాయి కీలకపాత్రలో నటించిన తమిళ సిరీస్ 'స్వీట్ కారం కాఫీ'. దీన్ని తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో తీసిన ఈ సిరీస్ కు స్వాతి రఘురామన్, కృష్ణ మరిముత్తు, బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. లయన్ టూత్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రేష్మ ఘటాల నిర్మించారు. మూడు జనరేషన్లకు చెందిన ముగ్గురు మహిళలు.. ఓ రోడ్ జర్నీ చేసే క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? మనకు ఏం చెప్పారు అనేది సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. దీన్ని 240 దేశాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. three generations, one epic adventure! get ready to join the craziest road trip of the year 🚙 watch #SweetKaaramCoffee on Prime Video, July 6#ReshmaGhatala #Lakshmi @madhoo69 @santhybee #VamsiKrishnan @liontoothsocial @nambiarbejoy @krishnammuthu @whatiswat @manju_mohan83… pic.twitter.com/2Gty2LyR1r — prime video IN (@PrimeVideoIN) June 27, 2023 (ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)