ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా లెక్కకు మించి మన ముందుకు వస్తున్నాయి. అద్భుతంగా అలరిస్తున్నాయి. రెండు గంటల్లో చెప్పలేని కొన్ని కథల్ని పలువురు దర్శకులు.. వెబ్ సిరీసులుగా తీస్తున్నారు. అలా అమెజాన్ ప్రైమ్ మరో క్రేజీ అడ్వెంచరస్ సిరీస్ ని సిద్ధం చేసింది. మూడు జనరేషన్లకు చెందిన మహిళా నటులతో తీసిన ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించింది.
(ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?)
'మురారి' సినిమాలో మహేశ్ బాబుకి తల్లిగా నటించిన లక్ష‍్మి మనకు తెలుసు. ఎన్నో సినిమాల్లో నటించి మనందరికీ ఫేవరెట్ అయిపోయారు. అలానే 'రోజా'లో హీరోయిన్ గా చేసిన మధుబాల కూడా మనకు పరిచయమే. ఈమె ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరితోపాటు శాంతి అనే మరో అమ్మాయి కీలకపాత్రలో నటించిన తమిళ సిరీస్ 'స్వీట్ కారం కాఫీ'. దీన్ని తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఎనిమిది ఎపిసోడ్స్ తో తీసిన ఈ సిరీస్ కు స్వాతి రఘురామన్, కృష్ణ మరిముత్తు, బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. లయన్ టూత్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రేష్మ ఘటాల నిర్మించారు. మూడు జనరేషన్లకు చెందిన ముగ్గురు మహిళలు.. ఓ రోడ్ జర్నీ చేసే క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? మనకు ఏం చెప్పారు అనేది సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. దీన‍్ని 240 దేశాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
three generations, one epic adventure! get ready to join the craziest road trip of the year 🚙
— prime video IN (@PrimeVideoIN) June 27, 2023
watch #SweetKaaramCoffee on Prime Video, July 6#ReshmaGhatala #Lakshmi @madhoo69 @santhybee #VamsiKrishnan @liontoothsocial @nambiarbejoy @krishnammuthu @whatiswat @manju_mohan83… pic.twitter.com/2Gty2LyR1r
(ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)
Comments
Please login to add a commentAdd a comment