డెంగీ లక్షణాలతో విద్యార్థిని మృతి
తంబళ్లపల్లి (చిత్తూరు): డెంగీ వ్యాధి లక్షణాలతో తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏడవ తరగతి విద్యార్థిని బుధవారం మృతి చెందింది. తంబళ్లపల్లికి చెందిన డి.సాంబచారి కుమార్తె పూజిత స్థానిక మోడల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది.
జ్వరంతోపాటు ప్లేట్లెట్ పడిపోవడం, తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆమెను మూడు రోజుల క్రితం తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది.