డెంగ్యూ విస్తరణ
హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని ప్రాంతాలుగా ఇన్నాళ్లుగా పోల్చిచూస్తూ వచ్చారు. కాని విశ్వనగరమని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న భాగ్యనగరాన్ని డెంగ్యూ వ్యాధి ఉన్న, లేని ప్రాంతాలుగా విభజించి చూసే పరిస్థితి వచ్చిం దని తెలుస్తుంటే వణుకు పుడుతోంది. పగటిపూట కాటు వేయ డం ద్వారా దోమలు ఈ వ్యాధిని వ్యాపింపచేస్తున్న ప్రాంతాలు ప్రధానంగా బస్తీలేనని తేలుతోంది. అయితే సంపన్నులు తలుపులు బిగించుకున్నంత మాత్రాన, ఏసీల్లో గడిపినం త మాత్రాన డెంగ్యూ వ్యాధినుంచి బయటపడతారను కోవడం కల్లే. నిరుపేదల్లో విస్తరించి సంపన్నులను కూడా కబళించిన వ్యాధుల చరిత్ర మనందరికీ తెలుసు. ప్రజారోగ్యవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనచేస్తే తప్ప హైదరాబాద్‌ను డెంగ్యూ, స్వైన్‌ప్లూ వ్యాధులు వదలవుగాక వదలవు.
ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా పారిశుధ్యం విషయంలో తెలంగాణ రాజధాని నేటికీ అధ్వానంగా ఉంటోందన్నది వాస్తవం. వీధుల్లో రోజుల తరబడి నిండుగా కనిపిస్తున్న చెత్త కుండీలను చూస్తున్న ప్పుడు డెంగ్యూలు, స్వైన్‌ఫ్లూ కేసులు హైదరాబాద్‌లో ఇంత ఎక్కువగా ఎందుకుంటున్నాయో సులభంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నగరంలో పరిశుభ్రతపై ఇకనైనా దృష్టి ఉంచాలి.
మల్లేశం చింతలబస్తీ, ఖైరతాబాద్