Sydapuram
-
మేం చచ్చిపోతాం.. ఎలా బతకాలి సార్
-
విదేశీ యువతిపై అత్యాచారయత్నం
సైదాపురం/గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన ఓ యువతి (26) భా రత దేశం పర్యటనకు వచ్చింది. సోమవారం శ్రీలం క నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గో వా వెళ్లేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు బస్సులో బయల్దేరింది. ఆమె వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుంచి దించేశా డు. అదే బస్సులోనే ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన ఇంగిలాల రమణయ్య కుమారుడు సాయికుమార్ ఆమెకు తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. సందర్శనీయ స్థలాలు చూపిస్తానని నమ్మించి తన స్వగ్రామం బద్దెవోలు వెంకన్నపాళెంకు తీసుకొచ్చాడు. గూడూరు రూరల్ పరిధిలోని ఎల్ఏపీ స్కూల్ ప్రాంతంలోని శారదానగర్‌కు చెందిన తన స్నేహితుడు షేక్ అబిద్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పథకం రూపొందించాడు. మంగళవారం ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపుతామని చెప్పి, అబీద్‌తో కలిసి మోటార్ బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం అనుమానాస్పదంగా ఉండడంతో వారి నుంచి తప్పించుకుని ఆ యువతి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా భయంతో నిలబడ్డ ఆ యువతిని చూసి స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఈలోగా యువకులిద్దరూ పరారయ్యారు. జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలతో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులరెడ్డి, సైదాపురం, గూడూరు రూరల్, మనుబోలు ఎస్సైలు టీంలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్టు చేశారు. -
నీట మునిగిన 100 ఇళ్లు
సైదాపురం (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు కరెంటు కూడా తీసివేయడంతో తాగునీరుకు కూడా కష్టమయింది. -
వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై తెలుగు తమ్ముళ్ల దాడి
సైదాపురం (నెల్లూరు) : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే అనుమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, కార్యకర్త ఇళ్లపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. టీడీపీ నాయకుడు శరత్, అతని అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఎ.ప్రసన్నకుమార్‌రెడ్డి, కార్యకర్త తిరుపతయ్య ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం సమీపంలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసి... పోలీసులకు సమాచారం అందంచారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చదువులేని బతుకు వద్దమ్మా..
కొడవలూరు మండలంలోని నార్త్‌రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మమ్మ కుమార్తె హారికకు చదువంటే ప్రాణం. ఇటీవల పదో తరగతిలో పదికి 8.3 పాయింట్లు సాధించింది. భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటూ ఇంటర్లో చేరాలని భావించింది. భర్త చనిపోయి కుటుంబం గడవడమే కష్టమైన పద్మమ్మకూ కూతురిని చదివించాలనే ఆశ ఉన్నా ఆర్థికలేమి అడ్డంకిగా మారింది. ‘అమ్మా నిన్ను చదివించాలనే కోరిక నాకూ ఉంది. కాని చదువంటే మాటలు కాదు..డబ్బుతో పని. మనదగ్గర డబ్బులేకుండా నిన్ను ఎలా చదివించాలి’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేసింది అమ్మ పద్మమ్మ. చదువులేని జీవితం వృథా అని కాబోలు ఆ బిడ్డ సైదాపురం మండలం చాగణంలో మేనత్తగారి ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. సైదాపురం, న్యూస్‌లైన్: కొడవలూరు మండలంలోని నార్త్‌రాజుపాళెం నివాసి పోలిశెట్టి పద్మ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొంతకాలం కిందట పద్మమ్మ భర్త చనిపోయారు. పద్మమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హారిక రాజుపాళెం లో చదివి ఇటీవల పదో తరగతి 8.3 పాయింట్లు సాధించింది. ‘అమ్మా నేను ఇంటర్లో చేరుతా. పెద్ద చదువులు చదువుకుంటా’ అని తల్లిని ప్రాథేయపడింది హారిక. ‘నాన్న చనిపోయాడు కదమ్మా. నీవు చదువుకునేందుకు మన దగ్గర డబ్బులేదు. ఇక చదువు మా నేయి’ అని బాధను దిగమింగుకుని బిడ్డకు తల్లి సర్ది చెప్పింది. చదువును ప్రాణంగా ప్రేమించే హారిక మనసును తల్లి మాటలు మార్చలేకపోయాయి. సైదాపురం మండలంలోని చాగణంలో ఉన్న మేనత్త రాజేశ్వరమ్మ దగ్గరికి వెళుతున్నానని చెప్పి సోమవారం అమ్మకు వీడ్కోలు చెప్పింది. మేనత్తగారింటికి వచ్చిన హారిక దిగులుగానే ఉండింది. అనుక్షణం తానిక చదువుకు దూరంగా ఉండాలనే ఆలోచన హృదయాన్ని కలచివేసింది. చదువులేని బతుకు ఎందుకని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి మేనత్త ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న హారికను రాపూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ బుధవారం ఆ చదువుల బిడ్డ తుదిశ్వాస విడిచింది. ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేయించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అమ్మా వెళుతున్నా.. అమ్మా వెళుతున్నా అంటూ హారిక తన తల్లితో అన్న చివరిమాటలు. శవమై బిడ్డ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబం ఆర్థిక పరిస్థితే హారిక మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు.