Sydney city
-
ఆస్ట్రేలియాలో మోదీ ప్రసంగం.. కిక్కిరిసిన ఎరీనా (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో శనివారం ఆవిష్కరించారు. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె వాణీదేవి, ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల, అక్కడి నగర మేయర్ మాథ్యూ బ్లాక్మెర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, హార్న్ కౌన్సిలర్ శ్రీని పిల్లమర్రితో కలిసి ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం. భారతదేశ పాలనావ్యవస్థలో అనేక మార్పులు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యుదయానికి పీవీ పాటుపడ్డారని పలువురు వక్తలు కొనియాడారు. పీవీ సంస్కరణల ఫలితాలను, ప్రయోజనాలను ప్రస్తుతం భారత్ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ హేమచందర్‌రావు కల్వకోట, సుజాత కల్వకోట, భారతి, విజయ హాజరయ్యారు. ఇదీ చదవండి: యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్ -
అప్పుడు 88.. ఇప్పుడు 89
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కి మరచిపోలేని రోజులా మారింది. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ కట్టడి చేసే చహల్ ఈ రోజు ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఈ క్రమంలోనే చెత్త గణాంకాలను నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా అపప్రథను మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లలో వికెట్ మాత్రమే సాధించిన చహల్.. 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఒక భారత స్పిన్నర్‌గా వన్డేల్లో ఇది చెత్త రికార్డు. ఈ క్రమంలోనే తన రికార్డు తానే అధిగమించాడు చహల్. వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్ గా చహల్ పేలవ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు 2019 ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో ఇంగ్లాండ్‌పై 88 పరుగులు ఇచ్చిన చహల్ ప్రస్తుతం తన రికార్డును తానే అధిగమించాడు. ప్రధానంగా ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ లు చహల్ బౌలింగ్ పై విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఫించ్ తన 17 వ వన్డే సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇదేకాక 126 ఇన్నింగ్స్‌లలో 5000 వన్డే పరుగులు వేగవంతంగా సాధించిన రెండో ఆస్ట్రేలియన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును సాధించే క్రమంలో డీన్ జోన్స్(128 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును ఫించ్ సవరించాడు.ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా, టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా(90) వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, ధావన్(74) సైతం ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంచితే, వన్డే ఫార్మాట్లో భారత్‌పై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరుగా రికార్డు పుస్తకాల్లో నమోదైంది. -
షాపింగ్ మాల్ వద్ద కాల్పులు: ఒకరు మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రికార్డు రోడ్డులోని సెంట్రల్ షాపింగ్ మాల్ ఎదుట శుక్రవారం ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా...మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఈ కాల్పులపై డిటెక్టివ్ సూపరింటెండెంట్ డేవిడ్ స్పందించారు. ఇది విచక్షణరహితంగా కాల్పులు జరిపింది... కాదని... ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని... కాల్పులు జరిపారని స్పష్టం చేశారు. ఆ కాల్పుల్లో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మరణించాడన్నారు. అయితే ఇంతవరకు ఈ ఘటనలో అరెస్ట్ చేయలేదని చెప్పారు. సదరు మృతి చెందిన వ్యక్తి నేరస్థులతో సంబంధాలు కొనసాగించి ఉండవచ్చని చెప్పారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయన్నారు. ఈ మేరకు ఏబీసీ పేర్కొంది. భద్రత చర్యల్లో భాగంగా సెంటర్ కారు పార్కింగ్ మూసివేసినట్లు ప్రకటించారు.