సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రికార్డు రోడ్డులోని సెంట్రల్ షాపింగ్ మాల్ ఎదుట శుక్రవారం ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా...మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఈ కాల్పులపై డిటెక్టివ్ సూపరింటెండెంట్ డేవిడ్ స్పందించారు. ఇది విచక్షణరహితంగా కాల్పులు జరిపింది... కాదని... ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని... కాల్పులు జరిపారని స్పష్టం చేశారు.
ఆ కాల్పుల్లో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మరణించాడన్నారు. అయితే ఇంతవరకు ఈ ఘటనలో అరెస్ట్ చేయలేదని చెప్పారు. సదరు మృతి చెందిన వ్యక్తి నేరస్థులతో సంబంధాలు కొనసాగించి ఉండవచ్చని చెప్పారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయన్నారు. ఈ మేరకు ఏబీసీ పేర్కొంది. భద్రత చర్యల్లో భాగంగా సెంటర్ కారు పార్కింగ్ మూసివేసినట్లు ప్రకటించారు.