Syndicate politics
-
బెంగాల్లో సిండికేట్ రాజ్యం
చుచుర(పశ్చిమబెంగాల్)/ధెమాజి(అస్సాం): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు పెంచారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అధికార పార్టీ ఆధ్వర్యంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఆ సిండికేట్‌కు ‘కట్ మనీ’ చెల్లించకుండా సామాన్యులకు ఏ పనీ కావడం లేదన్నారు. ‘చివరకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా.. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా కట్ మనీ ఇవ్వాల్సిందే. సిండికేట్ అనుమతి లేకుండా ఏ పనీ కాదు’అని విమర్శించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రముఖులను, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సురక్షిత తాగు నీటిని అందించే కేంద్ర ప్రభుత్వ ‘జల్‌జీవన్’పథకాన్ని కూడా రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను ఇబ్బందులు పెడ్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుని రైతులకు, పేదలకు వాటి ప్రయోజనాలు లభించకుండా చేశారని ఆరోపించారు. హూగ్లీ జిల్లాలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా నొవాపాడా నుంచి దక్షిణేశ్వర్ వరకు మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌తో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దక్షిణేశ్వర్లో 160 ఏళ్ల నాటి ప్రఖ్యాత కాళీ మాత ఆలయం ఉంది. స్వయం సమృద్ధ భారత్‌కు పశ్చిమబెంగాల్ చాలా కీలకమైన కేంద్రమని ప్రధాని పేర్కొన్నారు. అస్సాంను అభివృద్ధి చేయలేదు గతంలో అస్సాంను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అస్సాంను, ఈశాన్య రాష్ట్రాలను దశాబ్దాల తరబడి గాలికి వదిలేశాయని మండిపడ్డారు. అస్సాంలో సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ‘స్వాతంత్య్రం అనంతరం దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు దిస్పూర్ ఢిల్లీకి చాలా దూరమని భావించారు. కానీ ఇప్పుడు ఢిల్లీ దూరంలో లేదు. మీ దర్వాజా ముందే ఉంది’అని ధెమాజి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మార్చి 7వ తేదీలోపు ప్రకటించే అవకాశముందని ప్రధాని సంకేతాలిచ్చారు. ‘ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 7లోపు ప్రకటిస్తారని నేను అంచనా వేస్తున్నా’అని అన్నారు. ప్రధాని అస్సాంలో పర్యటించి రూ. 20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రక్షణ’ తయారీపై నిర్లక్ష్యం రక్షణ రంగ పరికరాల తయారీలో భారత్ వేగంగా సామర్థ్యాలను పెంచుకుంటోందని మోదీ అన్నారు. స్వాతంత్య్రానికి ముందే భారత్‌లో వందలాది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల ఎగుమతి జరిగిందని గుర్తు చేశారు. తదనంతర కాలంలో, వాటిని పట్టించుకోలేదని, వాటిని బలోపేతం చేసేందుకు కృషి చేయలేదని విమర్శించారు. రక్షణ రంగానికి తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపుల సమర్థ వాడకంపై వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. -
రాజకీయ మతా‘ల’బు!
కమలానగర్. అనంతపురంలోని ఈ వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చుట్టూ దీపావళి సందడి ఉంటోంది. ఓ రాజకీయ పార్టీని అంటిపెట్టుకొని దందా సాగించే ఈ వ్యక్తి.. నేతలతో పాటు అధికారులకూ సుపరిచితుడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. టపాసుల వ్యాపారంలో చక్రం తిప్పేది మాత్రం ఈయనే. ఎవరికి ఎంత ముడుపు ముట్టజెబితే పని అవుతుందో.. ఏ నాయకుడిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది.. మూడు రోజుల టపాసుల విక్రయం ఈ వ్యక్తి చేతిలో ‘వెలుగులు’ విరజిమ్ముతుంది. సాక్షి, అనంతపురం : దీపావళి పండుగకు నెల రోజుల ముందుగానే వ్యాపారస్తుల్లో సందడి మొదలైంది. మూడు రోజుల్లో పెట్టుబడి పోను లక్షల్లో ఆదాయం ఉండడంతో టపాసుల విక్రయం చుట్టూ అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుకాణాల లైసెన్స్‌లకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో 123 దరఖాస్తులు రాగా, జిల్లా వ్యాప్తంగా 263 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. వీళ్లే కాకుండా డీలర్లు పదుల సంఖ్యలో ఉన్నారు. అధిక శాతం గుంతకల్లు పట్టణంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి రాయలసీమ వ్యాప్తంగా టపాసులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యాపారమంతా ‘జీరో’లోనే సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఏమాత్రం పన్నులు చెల్లించకుండా వందల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ, అగ్ని మాపక శాఖ, తూనికలు కొలతలు, పోలీసుశాఖ.. ఇలా ఎవరి ముడుపులు వారికి ముడుతుండటం వల్లే అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మీరు టపాసుల వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీ వద్ద పెట్టుబడికి డబ్బులు లేవా? అయితే కమలానగర్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘చంటి’గాడిని కలవండి. మీ పని అయిపోయినట్టే. మీరు వెళ్లి దుకాణంలో కూర్చుంటే చాలు.. అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా.. టపాసులు అమ్మి పెట్టడమే. కాకపోతే ఖర్చులు పోను, వడ్డీ కూడా చెల్లించుకోవాలి మరి. ఆ వ్యక్తితో డీల్ కుదిరితే ఇక మీ ఇంట్లో ‘దీపావళి’ పండగే. అనంతలో చంటిగాడు టపాసుల వ్యాపారం గత కొన్నేళ్లుగా రాజకీయమైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి చెందిన అనుయాయులే ఈ వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. అయితే వీరి వెనుక ఉండి చక్రం తిప్పేది మాత్రం ఒక్కరే వ్యక్తి. ఓ రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని కొన్నేళ్ల నుంచి ‘చంటి’గాడు ఈ తతంగం నడిపిస్తున్నాడు. టపాసుల వ్యాపారంలో చేయి తిరిగిన వ్యక్తి కావడంతో మిగిలిన వారు కూడా ఆయన దారిలోనే నడవాల్సిన పరిస్థితి. తమిళనాడులోని శివకాశి నుంచి తక్కువ ధరకు ప్రభుత్వాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా జిల్లాకు టపాసులను రప్పించడం ఈ వ్యక్తి ప్రత్యేకత. బయటకు చూపించేందుకు రూరల్ పరిధిలో కొంత సరుకును ఉంచుతుండగా.. మిగిలిన సరుకు శింగనమల సమీపంలోని సొంత గోదాములో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఎవరి ముడుపులు వారికి.. రూ.కోట్లలో సాగిస్తున్న వ్యాపారంలో ఎవరూ అడ్డు తగలకుండా ఎవరి ముడుపులు వారికి అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ప్రభుత్వానికి పన్నులు చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఈ అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన పాపాన పోలేదు. టాపాసుల విక్రయాల్లో వ్యాపారస్తులకు దాదాపు 80 నుంచి 90శాతం లాభాలే. ఎంఆర్పీ, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, గడువు తేదీ తప్పనిసరిగా టపాసుల బాక్సులపై ముద్రించాలి. ప్రస్తుతం శివకాశి నుంచి దిగుమతి అవుతున్న సరుకులో ఇలాంటి విషయాలు ఏవీ ఉండవు. వ్యాపారస్తుడు చెప్పిందే ధరగా వినియోగదారుడు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జీరోతో దిగుమతి చేసుకుంటుండడంతో వ్యాపారస్తులు భారీగా లబ్ధి పొందుతున్నారు. అనంతలో కీలకమైన ఆ వ్యాపారి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రతి ఏటా దీపావళి వస్తే అనంతలో ఇతని సందడి అంతాఇంతా కాదు. వ్యాపారస్తులకు సైతం అప్పు రూపంలో సరుకు ఇచ్చి వడ్డీ సహా వసూలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల ఆశీస్సులు ఉండటంతో ఈ చంటిగాని దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దందా ‘సిండికేట్’ టపాసుల వ్యాపారం జిల్లా కేంద్రంలో దాదాపు ‘సిండికేట్’ కనుసన్నల్లో నడుస్తోంది. అలాగని ఎంతో మంది ఉంటారనుకుంటే పొరపాటు. ఓ వ్యక్తి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోంది. 20 నుంచి 30 ఏళ్లుగా టపాసుల వ్యాపారంలో పండిపోయిన ఈ వ్యక్తి చెప్పిందే ఇక్కడ వేదం. ఎవరికి దుకాణం దక్కినా.. వ్యాపారం మాత్రం ఆయన మాటకు కట్టుబడి సాగించాల్సిందే. యేటా ఈ దందా ఆసక్తికరంగా ఉంటోంది. పండుగకు వారం రోజుల ముందు నుంచి ఒకటే హడావుడి. అక్కడా.. ఇక్కడ.. అదిగో.. ఇదిగో.. వాళ్లూ.. వీళ్లూ.. ఇలాంటి హడావుడి మధ్య పండుగకు ఒక రోజు, రెండు రోజుల ముందు ‘దుకాణం’ తెరుచుకుంటుంది. -
బెంగాల్లో ‘సిండికేట్’ రాజ్యం
మిడ్నాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సిం డికేట్ రాజ్యం నడుస్తోందనీ, దాని అను మతి లేకుండా రాష్ట్రంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల్ని వరుసగా హత్యచేసినా ప్రజ లు తమవెంటే నిలిచారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి బెంగాలీలు త్వరలోనే విముక్తి పొందుతారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ న్నారు. పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌లో సోమవారం నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో మోదీ నిప్పులుచెరిగారు. జనగణమన గడ్డపై: ‘జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం పుట్టిన భూమిని ప్రస్తుతం రాజకీయ సిండికేట్ పాలిస్తోంది. ఈ సిండికేట్ బుజ్జగింపు, ముడుపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిండికేట్ల ద్వారా చిట్ ఫండ్లను నడుపుతూ రైతులకు దక్కాల్సిన లబ్ధిని లాగేసుకుంటోంది. చివరికి కేంద్రం పంపే నిధుల్ని సైతం వీరి అనుమతి లేకుండా ఖర్చుపెట్టడం కుదరడం లేదు’ అని మోదీ అన్నారు. తన పర్యటనను నిరసిస్తూ తృణమూల్ కార్యకర్తలు మమత ఫొటోలు, పోస్టర్లను సభలో ప్రదర్శించడంపై మోదీ స్పందిస్తూ.. ‘మేం సాధించిన విజయాలను తృణమూల్ కూడా అంగీకరిస్తోంది. అందుకే చేతులు జోడించిన సీఎం మమతా బెనర్జీ పోస్టర్లతో వాళ్లు ప్రధానికి స్వాగతం పలికారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూలిన టెంట్.. 67 మందికి గాయాలు ప్రధాని కిసాన్ కళ్యాణ్ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ టెంట్ కూలిపోవడంతో 13 మంది మహిళలు సహా 67 మంది గాయపడ్డారు. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వెంటనే స్పందించిన మోదీ బాధితులకు సాయమందించాలని పక్కనే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారుల్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోదీ ప్రసంగం సందర్భంగా పలువురు కార్యకర్తలు టెంట్‌పైకి ఎక్కారు. చివరికి టెంట్ పైభాగంగా బరువు ఎక్కువ కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. -
రాజకీయాల్లోకి సాఫ్ట్వేర్ ఇంజినీర్
నారాయణఖేడ్: సిండికేట్ రాజకీయాలను మార్చేస్తానంటూ ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఇతను నెలకు దాదాపు రూ.85 వేల వేతనాన్ని సైతం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మురళి గోవిందు(33) సోమవారం నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ తాజాగా జరిగే ఉప ఎన్నిక లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుపొందుతానన్న ధీమా వ్యక్తం చేశారు. తాను సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించక ముందు గ్రూప్స్‌కు సన్నద్ధమైనట్టు చెప్పారు. ఆ సందర్భంలో సామాజిక అభివృద్ధికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నానని, భారత రాజ్యాంగం, పరిపాల న విధానంపై ఉన్న పట్టుతో తాను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయన్నారు. తనకు ఉన్న విషయ పరిజ్ఞానాన్ని రంగరించి నియోజకవర్గ అభివృద్ధి పరిచి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన ఖేడ్‌ను చేర్చడమే ధ్యేయమని తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తనకు మధ్యతరగతి, పేద కుటుంబాల సమస్యలు తెలుసన్నా రు. వీరి పక్షాన నిలబడి వీరందరినీ సామాజికంగా, ఆర్థికంగా బలోపే తం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి ఇంటిముందు ముగ్గులా కాపలా కాస్తూ అభివృద్ధికి తోడ్పడతానిని తెలిపారు.