Syria Rebels
-
చేజారిన మరో నగరం
బీరూట్: బషర్ అల్ అస్సాద్ సారథ్యంలోని సిరియా ప్రభుత్వం మరో వైఫల్యాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వ సేనలతో మూడు రోజుల తరబడి పోరాడిన సిరియా తిరుగుబాటుదారులు ఎట్టకేలకు హమా నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో విస్తీర్ణంపరంగా దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా ఇప్పుడు తిరుగుబాటుదారుల వశమైంది. హమా నగరంలోని పోలీసు కమాండ్ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం, కేంద్ర కారాగారంపై తిరుగుబాటుదారులు పట్టుసాధించారు. జైళ్లో ఉన్న వందల మంది తోటి తిరుగుబాటుదారులు, ఖైదీలను బయటకు వదిలేశారు. తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టంలేక తాము నగరాన్ని వదిలేసి వచి్చనట్లు సైన్యం గురువారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు. ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘దేశ రాజధాని డమాస్కస్‌కు సింహద్వారంగా హోమ్స్ సిటీకి పేరుంది. డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్‌కు ఇది మింగుడుపడని వ్యవహారమే. ఎందుకంటే హమాపై పట్టు కోల్పోయారంటే అస్సాద్ త్వరలో దేశంపైనా పట్టుకోల్పోతారని అర్థం’’అని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంస్థ ‘వార్ మానిటర్’చీఫ్ రమీ అబ్దుర్రహమాన్ వ్యాఖ్యానించారు. ‘‘మేం హమాను గెలిచాం’’అని బుధవారం అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుబాటు సంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేత అల్గోలానీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజుల తరబడి నిలువరిస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2011 మార్చిలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు తుర్కియే దన్నుతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపం సంతరించుకుని ఇటీవలి కాలంలో ఉధృతమైంది. ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వపాలనానీడలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గతంలో అస్సాద్‌కు పూర్తి అండదండలు అందించిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి. మిత్ర దేశం సిరియాకు సైనిక, ఆర్థిక సాయం చేసేంత తీరిక వాటికి లేదు. ఉక్రెయిన్‌తో రష్యా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధంలో మునిగిపోవడం తెల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుని ఇటీవలి కొద్దినెలలుగా తిరుగుబాటుదారులు తమ ఆక్రమణలకు వేగం పెంచారు. తిరుగుబాటుదారులు బుధవారం ఆక్రమించిన హమా పేరు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 1982 ఊచకోత ఈ నగరంలోనే జరిగింది. అస్సాద్ తండ్రి హఫీజ్ కర్కశ ఏలుబడిలో ప్రభుత్వం ఇస్లామిక్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి ఊచకోతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది. ఐసిస్ అధినేత మరణాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఈయన సిరియాలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ నెల మధ్యలో దక్షిణ సిరియా రెబల్స్.. హసన్ అల్ హమిషీని హతమార్చినట్లు పేర్కొన్నారు. ఐసిస్ చీఫ్‌గా హసన్ అల్ హషిమీ 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. అతనికి ముందు ఈ ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అబు ఇబ్రహీం ఖురేషి ఉండేవాడు. అమెరికా దళాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడ్ని సిరియాలో మట్టుబెట్టాయి. చదవండి: అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం -
ఒమ్రాన్ సోదరుడి మృతి
బీరుట్ : సిరియా రెబల్స్ అధీనంలో ఉన్న తూర్పు అలెప్పోపై ఈ నెల 17న ప్రభుత్వ దళాలు చేసిన వైమానిక దాడిలో గాయపడి, రక్తపుచారికలతో అంబులెన్సులో కూర్చొని ఉన్న నాలుగేళ్ల ఒమ్రాన్ గుర్తుండే ఉంటాడు. ఈ బాలుడి ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించింది. అదే దాడిలో గాయపడిన ఒమ్రాన్ అన్న అలీ (10) శనివారం కన్నుమూశాడు. మరణాన్ని అలెప్పో మీడియా సెంటర్ ధ్రువీకరించింది. ఒమ్రాన్ ఫొటోలు చూసిన అనేకమంది సిరియాలో చిన్నారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సిరియాలో ఘర్షణలు మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 15 వేల మంది చిన్నారులు సహా 2.90 లక్షల మంది చనిపోయారని అంచనా. -
కిరాతకం.. బాలుడి తలనరికేశారు
బీరుట్: సిరియా తిరుగుబాటుదారులు అతి దారుణంగా ఓ బాలుడి తల నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. సిరియాలోని అలెప్పో నుంచి 13 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి ఓ ప్రదేశంలో ఉన్న ట్రక్‌లో కూర్చోబెట్టి రెబల్స్ కత్తితో తల నరికేశారు. అలెప్పోలోని హండరత్ ప్రాంతంలోని ఎవరినీ వదిలిపెట్టమని ఓ తిరుగుబాటుదారుడు గట్టిగా అరుస్తున్న సన్నివేశాలు వీడియోలో కనిపించాయి. అలెప్పో ఉత్తర ప్రాంతంలో సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరుగుతుండడం తెలిసిందే. కాగా, బాలుడికి పదేళ్ల వయసు ఉంటుందని భావిస్తున్నారు. వలసదారుల శిబిరం నుంచి అతడిని ఎత్తుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు. లివా ఆల్ ఖ్వాద్ తీవ్రవాద సంస్థతో ఈ బాలుడికి సంబంధాలున్నాయని బందీగా తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఆల్ ఖ్వాద్ లో ఎక్కువమంది పాలస్తీనా పౌరులున్నారు. తిరుగుబాటుదారులు హత్య చేసిన బాలుడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆల్ ఖ్వాద్ స్పష్టం చేసింది. కాగా, ముక్కుపచ్చలారని బాలుడి చంపడం తప్పేనని తిరుగుబాటు దారులు ఒప్పుకున్నారు. ఇది వ్యక్తగత స్థాయిలో జరిగిన తప్పిదమని, దీనిపై విచారణ జరుపుతామని తిరుగుబాటు సంస్థ నౌర్ ఆల్-దిన్ జెంకీ తన ఫేస్బుక్ పేజీలో తెలిపింది.