కిరాతకం.. బాలుడి తలనరికేశారు | Rebels in Syria behead boy in 'mistake' | Sakshi
Sakshi News home page

కిరాతకం.. బాలుడి తలనరికేశారు

Published Thu, Jul 21 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

కిరాతకం.. బాలుడి తలనరికేశారు

కిరాతకం.. బాలుడి తలనరికేశారు

బీరుట్: సిరియా తిరుగుబాటుదారులు అతి దారుణంగా ఓ బాలుడి తల నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. సిరియాలోని అలెప్పో నుంచి 13 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి ఓ ప్రదేశంలో ఉన్న ట్రక్‌లో కూర్చోబెట్టి రెబల్స్ కత్తితో తల నరికేశారు. అలెప్పోలోని హండరత్ ప్రాంతంలోని ఎవరినీ వదిలిపెట్టమని ఓ తిరుగుబాటుదారుడు గట్టిగా అరుస్తున్న సన్నివేశాలు వీడియోలో కనిపించాయి. అలెప్పో ఉత్తర ప్రాంతంలో సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరుగుతుండడం తెలిసిందే.

కాగా, బాలుడికి పదేళ్ల వయసు ఉంటుందని భావిస్తున్నారు. వలసదారుల శిబిరం నుంచి అతడిని ఎత్తుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు. లివా ఆల్ ఖ్వాద్ తీవ్రవాద సంస్థతో ఈ బాలుడికి సంబంధాలున్నాయని బందీగా తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఆల్ ఖ్వాద్ లో ఎక్కువమంది పాలస్తీనా పౌరులున్నారు.

తిరుగుబాటుదారులు హత్య చేసిన బాలుడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆల్ ఖ్వాద్ స్పష్టం చేసింది. కాగా, ముక్కుపచ్చలారని బాలుడి చంపడం తప్పేనని తిరుగుబాటు దారులు ఒప్పుకున్నారు. ఇది వ్యక్తగత స్థాయిలో జరిగిన తప్పిదమని, దీనిపై విచారణ జరుపుతామని తిరుగుబాటు సంస్థ నౌర్ ఆల్-దిన్ జెంకీ తన ఫేస్బుక్ పేజీలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement