టెట్‌కు 78 కేంద్రాలు
ఏలూరు, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఫిబ్రవరి 9న నిర్వహిస్తున్నట్టు జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు చెప్పారు. ఇందుకోసం ఏలూరులో 78 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరీక్షలు రాయటానికి జిల్లా నుంచి 17,669 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. వచ్చేనెల 9న ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్-1 పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి 1,605 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామన్నారు. దీనికి 16,064 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికోసం 71 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరిం చారు.
ఈ పరీక్షల నిర్వహణకు వెరుు్య మందికిపైగా అధికారులు, సిబ్బందిని విని యోగిస్తున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాల్లోని ఫొటోస్టాట్ షాపులను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. డీఈవో నరసింహరావు మాట్లాడుతూ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీఆర్వో కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.