t highcourt
-
'ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. టి న్యాయవాదుల సంఘం బుధవారం మంత్రితో భేటీ అయింది. జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... హైకోర్టు ఏర్పాటు ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికే ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి తెలిపారు. -
లాయర్ల దీక్షలకు మంత్రి రామన్న మద్దతు
ఆదిలాబాద్ : తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే న్యాయ శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మంత్రి జోగు రామన్న మద్దతు తెలిపారు. ప్రత్యేక కోర్టు డిమాండ్ తో 5 రోజులుగా మంచిర్యాలలో న్యాయవాదులు దీక్షలు చేస్తున్నారు. మంచిర్యాల కోర్టు వద్ద ఉన్న దీక్షల శిబిరాన్ని మంత్రి శనివారం సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దివాకర్‌రావు ఉన్నారు. (మంచిర్యాల)