
లాయర్ల దీక్షలకు మంత్రి రామన్న మద్దతు
ఆదిలాబాద్ : తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే న్యాయ శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మంత్రి జోగు రామన్న మద్దతు తెలిపారు. ప్రత్యేక కోర్టు డిమాండ్ తో 5 రోజులుగా మంచిర్యాలలో న్యాయవాదులు దీక్షలు చేస్తున్నారు. మంచిర్యాల కోర్టు వద్ద ఉన్న దీక్షల శిబిరాన్ని మంత్రి శనివారం సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దివాకర్‌రావు ఉన్నారు.
(మంచిర్యాల)