T padma rao
-
'భయపడొద్దు.. నేను ఆరోగ్యంగా ఉన్నా'
సాక్షి, హైదరాబాద్ : ‘ఆరోగ్యంగా ఉన్నాను... ప్రజల అభిమానం... ఆశీస్సులతో కరోనాను జయించి తిరిగి వారి మధ్యకు వస్తాను’ అని తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మోండా డివిజన్ టకారబస్తీలోని తన నివాసంలో హోం క్వారంటైన్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కరోనా కారణంగా కొద్ది రోజులు హోమ్ క్వారెంటైన్‌కు పరిమితం కావలసి వచ్చిందన్నారు. కరోనాకు సంబంధించి తనకు ఎలాంటి లక్షణాలు బయట పడలేదని... పరీక్షల్లో మాత్రమే తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు దూరంగా ఉండాల్సి రావడం కొంత ఇబ్బంది అయినా తప్పడం లేదన్నారు. ప్రజలెవరూ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుట పడేవరకూ మా నివాసానికి రాకుండా ఉండాలని పద్మారావుగౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తప్పని సరి అయితే తప్ప బయటకు రావద్దన్నారు. నా ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న... అమ్మవారి ఆశీస్సులతో త్వరగా పరిపూర్ణ ఆరోగ్య వంతుడిగా ప్రజల మధ్యకు వస్తానన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలతో హోం క్వారంటైన్లో ఆత్మవిశ్వాసంతో గడుపుతున్నానని, కరోనాకు మందుకన్నా మనోధైర్యం ఎంతో మేలు చేస్తుందన్నారు. -
'కంటోన్మెంట్'పై టీ మంత్రులు కసరత్తు
హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన కార్యచరణపై వారు ఈ సందర్భంగా చర్చిస్తారు. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది.