tabel tennis
-
ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్ విజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్ తొలి రౌండ్లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్జిక్ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్–10 ర్యాంకింగ్స్ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్ కెరీర్లో ఇది రెండోసారి. -
జతిన్‌దేవ్, కావ్యలకు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో కావ్య (ఏడబ్ల్యూఏ), జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) విజేతలుగా నిలిచారు. వ్యాసపురి బండ్లగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో జతిన్‌దేవ్ 3–0తో పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా, బాలికల తుది పోరులో కావ్య 3–1తో నిఖిత (వీపీజీ)ని ఓడించింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో కేశవన్ 4–0తో క్రిష్ సింఘ్వీ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్ 4–0తో ప్రణవ్ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. బాలికల సెమీస్‌లో భవిత (జీఎస్ఎం) 4–0తో నిఖిత (వీపీజీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు జూనియర్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 4–1తో యశస్విన్ (జీఎస్ఎం)పై, అమన్ (ఏవీఎస్‌సీ) 4–0తో వత్సిన్ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్ 4–1తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 4–1తో సాయినాథ్‌రెడ్డి (ఎంఎల్ఆర్)పై గెలిచారు. బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ) 4–1తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, అంజలి (జీఎస్ఎం) 4–1తో రమ్యపై, భవిత (జీఎస్ఎం) 4–0తో విధి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. యూత్ బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–3తో నైనాపై, శ్రీజ (ఎంఎల్ఆర్) 4–0తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. -
టీటీలో తొలిసారి కాంస్యం
ఏషియాడ్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని చరిత్ర సృష్టించిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు 0–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలై కాంస్యం దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో సత్యన్ 11–9, 9–11, 3–11, 3–11తో లీ సాంగ్సు చేతిలో... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 9–11, 9–11, 11–6, 11–7, 8–11తో యంగ్ సిక్ జియోంగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో అమల్‌రాజ్ 5–11, 7–11, 11–4, 7–11తో వూజిన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మరోసెమీఫైనల్లో చైనీస్ తైపీ 1–3తో చైనా చేతిలో ఓటమి పాలై కాంస్యాన్ని సాధించింది. ఫైనల్లో చైనా 3–0తో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. -
జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించినట్లు జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్, జాయింట్ సెక్రెటరీ ధనుంజయరెడ్డిలు తెలిపారు. జట్ల ఎంపిక స్థానిక అనంతపురం క్లబ్ నందు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా బాల, బాలికల, జూనియర్ బాలుర విభాగంలో ఎంపిక చేశామన్నారు. ఎంపికైన జట్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నవంబర్ 3 నుంచి 6 వరకు జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. బాలుర జట్టు వంశీకష్ణ, కుషల్‌కుమార్, ధార్మిక్, బాలసుబ్రహ్మణ్యం, కష్ణ బాలికల జట్టు హిమప్రియ, అమూల్య, హాసిని, భవ్యప్రియ, సులస్య జూనియర్ బాలుర జట్టు కుషల్‌కుమార్, ధార్మిక్, సాజిద్, కష్ణ, బాలసుబ్రహ్మణ్యం.