‘డబ్బులు వసూలు చేస్తున్న జేసీ బ్రదర్స్’
అనంతపురం: తాడిపత్రిలో అప్రజాస్వామిక పాలక నడుస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడుతూ... జేసీ బ్రదర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని, పరిశ్రమల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మెప్పు కోసమే జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జేసీ బ్రదర్స్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.