పోలవరం కుడి కాల్వ వద్ద రైతుల ఆందోళన
జానంపేట: గోదావరితో కృష్ణానదిని అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తమకు రావాల్సిన నీటిని ఎలా మళ్లిస్తారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టిసీమ పనులు పూర్తి కాకపోవడంతో తాడిపూడి ఎత్తిపోతల ద్వారా 500 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలించడాన్నిరైతులు తప్పుబడుతున్నారు. తమకు రావాల్సిన నీటిని ఎలా తరలిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట పోలవరం కుడి కాల్వ దగ్గర టీడీపీ నేతలు పూజలు చేసి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించారు. పోలవరం కుడి కాల్వ నుంచి మంగళవారం నీటిని తరలించడంతో వివాదం రాజుకుంది.