Tadoba
-
Poonam Dhanwatey: పులికి ఫ్రెండు
ఆసియాలో ఒకప్పుడు లక్ష పులులు ఉండేవట. ఇప్పుడు నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి. అందులో 2000 పులులు మన దేశంలో ఉన్నాయి. వేట, గ్రామీణుల ప్రతీకారం, కరెంటు కంచెలు... ఇవన్నీ పులిని చంపుతున్నాయి. మరి బతికిస్తున్నది? పూనమ్ ధన్వతే వంటి వన్యప్రాణి ప్రేమికులు. ప్రభుత్వంతో కలిసి పని చేసే ఇలాంటి వాళ్ల వల్లే పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ సామాజిక రంగాల్లో పని చేసే మహిళలకు పారిస్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ‘ఈవ్ రోచర్ ఫౌండేషన్’ గ్లోబల్ అవార్డ్ 2022 సంవత్సరానికి పూనమ్ ధన్వతేకు దక్కింది. ఇటీవల ఆమె పారిస్‌లో ఆ అవార్డును అందుకున్నారు. పులులను కాపాడటానికి ఆమె చేసిన సేవకు ఇది ఒక గొప్ప గుర్తింపు. 2001 లో అడవిలో కెమెరాలు బిగించడం ద్వారా పులుల సంఖ్యను తెలుసుకునే విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి పూనమ్. ఇప్పుడు ఆ విధానం చాలా చోట్ల అటవీ శాఖ ఉపయోగిస్తున్నది. 500 పులుల కాపలాదారు ఒకప్పుడు ఇంటీరియర్‌గా పని చేసిన పూనమ్ ధన్వతే వన్యప్రాణులు ముఖ్యంగా పులుల పట్ల తనకు ఉన్న ప్రేమ వల్ల ఆ రంగాన్ని వదిలిపెట్టి 2001లో ‘టైగర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్’ (ట్రాక్ట్) అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ కింద వన్యప్రాణుల కోసం ‘బోర్న్ ఫ్రీ’ అనే పర్యావరణ ఉద్యమాన్ని ఆమె నడుపుతోంది. స్వేచ్ఛగా ఉండాల్సిన వన్యప్రాణులతో మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడటమే ఈ ఉద్యమం లక్ష్యం. మన దేశంలో ఉన్న దాదాపు 2000 పులులలో 500 పులులు మధ్య భారతంలో (మహరాష్ట్ర– మధ్యప్రదేశ్ సరిహద్దులు) ఉన్న పంచ్, తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లలో ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్‌లను కాపాడే ప్రభుత్వ అటవీ శాఖతో పాటు కలిసి పని చేస్తూ ప్రజలకు అటవీ శాఖకు మధ్య వారధిగా ఉంటూ పులులకు మనుషులకు మధ్య సయోధ్య కుదిర్చే జటిలమైన పనిని గత రెండు దశాబ్దాలుగా తన భర్త హర్షవర్థన్‌తో కలిసి చేస్తోంది. తాడోబా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోయిన పూనమ్ పులులకే తన జీవితం అంకితం అంటుంది. పులుల మీద పుట్ర ‘అడవి పచ్చగా ఉంటే ఎరలు తిరుగాడుతాయి. పులి నోటికి ఎర చిక్కితే దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎర దొరక్కపోతేనే అది ఆకలితో ఊళ్ల సమీపానికి వస్తుంది. గ్రామస్తులు దానిని కొట్టి చంపుతారు’ అంటుంది పూనమ్ ధన్వతే. అడవుల్లో కుంటలు నీటితో ఉండేలా, గ్రామస్తులు వంట చెరుకు కోసం చెట్లు కొట్టకుండా, వేట జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పూనమ్ పని మొదలయ్యింది. టైగర్ రిజర్వ్‌లలో పులి ఉంటే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఆదాయం వచ్చి ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆమె గ్రామస్తులకు నేరుగా చూపించింది. స్థానికులను భాగస్తులను చేసి కెన్యాలో అభయారణ్యాలు స్థానికుల భాగస్వామ్యం వల్ల సురక్షితంగా ఉన్నాయని నిపుణులు అంటారు. అదే మోడల్‌ను పూనమ్ ధన్వతే తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లలో ప్రవేశపెట్టింది. అటవీ శాఖ కింద పని చేస్తున్న 500 మంది సిబ్బందితో పాటు రిజర్వ్ అంచున ఉన్న పల్లెల్లో స్త్రీ, పురుషులను ‘టైగర్ అంబాసిడర్లు’గా ఎంపిక చేసి వారిలో చైతన్యం కలిగించింది. 1300 మంది యువత 195 గ్రామాల నుంచి ధన్వతే కింద పులుల కోసం పని చేస్తున్నారు. ‘వీరంతా ప్రతి రోజూ అడవిలోకి వెళతారు. నేల మీద పులి, చిరుతపులి, ఎలుగుబంటి, అడవి కుక్కల పాద ముద్రలను గుర్తిస్తారు. అవి పల్లెలవైపు వచ్చేలా ఉంటే గ్రామస్తులను అలెర్ట్ చేస్తారు. పులి వల్ల గ్రామస్తులకు నష్టం... గ్రామస్తుల వల్ల పులికి నష్టం రాకుండా చూస్తారు’ అంటుంది పూనమ్. అందుతున్న ఫలాలు తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లు టూరిస్ట్ అట్రాక్షన్లుగా మారాయి. దాని వల్ల ఆ రిజర్వ్‌లకు ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం పల్లెలకే దక్కేటట్టుగా ప్రభుత్వంతో కలిసి సోలార్ దీపాలు, టాయిలెట్లు కట్టించింది. ప్రతి ఇంటికి సబ్సిడీలో గ్యాస్ కనెక్షన్లు ఇప్పించింది. దాంతో గ్రామస్తులు చాలా మటుకు సంతోషంగా ఉన్నారు. వారికి పులి ఉంటేనే జీవనం అని అర్థమైంది. అయితే పులులు మనుషుల్ని చంపడం జరుగుతూనే ఉంటుంది. పులి మనిషిని చంపిన చోట పులి విగ్రహం పెట్టి ఆ చనిపోయిన మనిషి కోసం నివాళి అర్పించడం గ్రామస్తులు నేర్చుకున్నారు. ఎంతో ప్రమాదం వస్తే తప్ప పులి జోలికి వెళ్లరు. టైగర్ రిజర్వ్ చుట్టూ కంచె వేయడం ద్వారా పులులను కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంది. ‘కాని మనుషులే కంచెగా మారి పులులను కాపాడాలి. అప్పుడే పులి బతగ్గలుగుతుంది’ అంటుంది పూనమ్. -
పెద్ద పులి వేటకు రంగం సిద్ధం
సాక్షి, అదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో పెద్ద పులుల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్(22) అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విఘ్నేష్‌ను నోట కరుచుకున్న పులి అడవిలోకి లాక్కెళ్లింది. పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్ మృతి చెందగా మరో ఇద్దరు 12లోపు పిల్లలు నవీన్, శ్రీకాంత్ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ డీఎఫ్‌వో విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దివిడ గ్రామాన్ని నేడు ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పులి దాడిలో యువకుడి మృతి ఇదిలా ఉండగా పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేశ్ కుటుంబానికి ప్రభుత్వం 15లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు. దిగిడాలో పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. కాగా ఇప్పటి వరకు అదిలాబాద్‌లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులు దాడి చేశాయి గానీ.. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు అరుదు. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రాణహిత నది దాడి పులులు వస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అందేరీ అభయారణ్యంలో 160 పులులు ఉండగా.. ఈ ఏడాది పులుల దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తరుచూ పులులు దాడి చేస్తున్న క్రమంలో 50 పులులను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తడొబా అభయారణ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారడంతో తెలంగాణలోకి పులు అడుగు పెడుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గూడెం గ్రామానికి మహారాష్ట్ర బార్డర్ ఒకటే కిలోమీటర్ దూరంలో ఉండగా, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాజాగా గిరిజన యువకుని మృతితో గిరిజనులు జనాల భయాందోళనకు గురవుతున్నారు. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది
ముంబై : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించడంతో పర్యాటకులు తమ చరవాణిలో చిరుతను బందించేందుకు పోటీపడ్డారు. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. ఇవాళ మళ్లీ తడోబా అభయారణ్యంలో దర్శనమిచ్చింది. -
ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మహారాష్ట్ర
చంద్రపూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ తడోబా అంధరీ టైగర్ రిజర్వ్ పరిధిలోని 47 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం 99 తరగతి గదుల్లోని 6,647 మంది విద్యార్ధులు ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని పొందనున్నారు. సుధీర్ మాట్లాడుతూ.. రిజర్వ్ పరిధిలోని విద్యార్ధులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను తడోబా రిజర్వ్ ఆకర్షిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఏటీఆర్ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో అడవులకు చేరువలో ఉన్న 15,500 గ్రామాల్లో పనిచేస్తున్న 12,665 జాయింట్ ఫార్స్ట్ మేనేజ్మెంట్ కమిటీలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. టీఏటీఆర్ పరిధిలోని 79 గ్రామాల్లో 50 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వ జన్-వన్ యోజన కింద నిధుల సమకూర్చనున్నట్లు వివరించారు