Tafseer Iqbal
-
‘ఒరిజినల్స్’ అవసరంలేదు
ఖమ్మంక్రైం: పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోని రావాలన్నారు. పార్టు–2 అప్లికేషన్ అడ్మిట్ కార్డుతో పాటు ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబం«ధించిన జిరాక్స్‌కాపీలను ఈవెంట్స్‌కు తీసుకురావాలన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంచినీటి సదుపాయం, అంబులెన్స్‌తోపాటు ప్రాథమిక వైద్య పరీక్షల కోసం వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. ఏడోరోజు ఈవెంట్స్‌కు 1152మంది మహిళా అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, శ్యామ్‌సుందర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల పట్ల.. అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంక్రైం : సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేసే ఆన్లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివస్ కార్యక్రమంలో సీపీకి పలువురు ఫిర్యాదులు అందజేశారు. నేలకొండపల్లికి చెందిన చెరుకూరి వీరబాబుకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని, బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి ఏటీఎం కార్డు నంబర్ తీసుకున్నాడు. ఆ అకౌంట్లో నగదు లేకపోవడంతో మరో నంబర్ ఇవ్వమని అడగడంతో సమీప బంధువుల ఏటీఎం నంబర్ తీసుకుని ఇచ్చాడు. ఓటీపీ నంబర్ చెప్పడంతో ఖాతాలోని రూ.32 వేలు కాజేశారు. కొంతసేపటి తర్వాత గుర్తించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే మరికొన్ని ఫిర్యాదులను బా«ధితులు సీపీకి అందజేశారు. ఇలా ఫోన్ చేసి నంబర్లు చెప్పమని అడిగితే చెప్పొద్దని, వారి సెల్ నంబర్‌ను పోలీసులకు తెలియజేయాలని సీపీ పేర్కొన్నారు. -
కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం
ఖమ్మంక్రైం : పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమైందని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని కోర్టు కానిస్టేబుళ్లకు ఒకరోజు కోర్టు మానిటర్ సిస్టం శిక్షణ శిబిరం సిటీ పోలీస్‌శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన నిందుతులకు శిక్ష పడినప్పుడే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. కేవలం సాక్షులను సకాలంలో న్యా యస్థానంలో హాజరు పరుస్తూ కోర్టు కానిస్టేబుళ్లు తీసుకోవాల్సిన చొరవే అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కోర్టు కానిస్టేబుళ్లకు ఐపాడ్ ట్యాప్స్ ఇచ్చామని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. నేరస్తులకు వారెంట్లు, సమన్లు సత్వరమే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కాని స్టేబుళ్లకు సూచించారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియపర్చాలని సూచించారు. కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు పొందు పర్చడం చేయాలని, కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు స్వీకరించాలని కోర్టు కానిస్టేబుళ్లను సీపీ ఆదేశించారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు, సీసీటీఎస్ఎస్లో సీఎంఎస్ (కోర్టు మానిటర్ సిస్టమ్)లో డేటా ఎంటర్ చేయాలని సూచించారు. ఈ డేటాను టీఎస్ కాప్‌కు అనుసంధానం చేస్తామని వివరిం చారు. దీని ద్వారా ప్రతిరోజు కోర్టులో ప్రక్రియ ఎలా ఉంటుందనేది ఆన్లైన్లో వెంటనే తెలుస్తుందని, కోర్టు కానిస్టేబుళ్ల పని సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోర్టులో ట్రయ ల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినట్లయితే పెండింగ్ లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతూ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ మరింత పరిజ్ఞానంతో పోలీసుల పని సులభరతం చేస్తున్నామన్నారు. కోర్టు విధుల్లో చక్కని ప్రతిభ కనబర్చిన కేసుల్లో శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామని, ఇప్పటివరకు గత నెలలో జైలు శిక్షపడిన కేసుల్లో కోర్టు సిబ్బంది ఆరుగురికి రివా ర్డు ఇచ్చామని సీపీ తెలిపారు. కాగా, ఐటీ కోర్ సిబ్బంది కోర్టు మానిటర్ సిస్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చినవారిలో ఎం.వెంకయ్య (ఎన్కూర్ పీఎస్), ఎం.భార్గవ్ (ముదిగొండ), శ్రీనివాసరెడ్డి(ఖమ్మం అర్బన్), ఆర్.నాగేశ్వరరావు (ఖమ్మం త్రీటౌన్), ప్రభాకర్ ఏఎస్ఐ ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేశ్‌కుమార్, ఖమ్మం ఏసీపీ వెంకట్రావు, సీసీఆర్బీ ఏసీపీ రామానుజం, డిప్యూటీ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామారావు, సీఐలు శివసాంబిరెడ్డి, సురేశ్, ఎస్ఐ జానీపాషా, ఆర్ఎస్ఐ మీరా తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :వేసవి నేపథ్యంలో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువయ్యూయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని చెప్పారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో విజయనగరం సబ్‌డివిజన్ పరిధిలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి సర్కిల్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు, ఇప్పటివరకు జరిగిన చోరీల్లో అపహరణకు గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్పెషల్ టీంలను నియమించి అనుమానిత వ్యక్తులు, పాతనేరస్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు మొబైల్ టీంలను నియమించాలని, రహస్య గస్తీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కార్యకమాలను నిర్వహించడం ద్వారా నేరాలను నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రహదారి నిబంధనలు పాటించేటట్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు పరిమితమైన వేగంతో వెళ్లేటట్లు చూడాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గత మాసంలో నమోదైన కేసులు, దర్యాప్తు దశలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, రెండో పట్టణ సీఐ పి.ముత్యాలనాయుడు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, సీఐలు బి.లలిత, ఎ.ఎస్.చక్రవర్తి, లక్ష్మణమూర్తి, ఇ.నర్సింహమూర్తి, వై.వి.శేషు, కుమారస్వామి, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.