taifaide
-
ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?
తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం.. స్మాల్‌పాక్స్ (మశూచి) క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్‌పాక్స్ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే. టైఫాయిడ్: 1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌ఫ్లూయెంజా: ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్‌లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు. పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్ సాక్, 1956లో ఆల్బర్ట్ సబిన్ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది. ఆంత్రాక్స్: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్ టీకాను మాత్రం 1937లో మాక్స్ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్ టీకా ఉత్పత్తి జరిగింది. ఎంఎంఆర్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్ హిల్లెమన్ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. చికెన్‌పాక్స్(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్పాక్స్గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్ సైంటిస్టులు విజయవంతమైన చికెన్‌పాక్స్ టీకా కనుగొన్నారు. ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్‌తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు. 2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్‌లో ఉన్నట్లు డబ్లు్యహెచ్‌ఓ తెలిపింది. యెల్లో ఫీవర్ 500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్ఫెల్లర్ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారు. మాక్స్ ధీలర్ 1937లో తొలిసారి యెల్లోఫీవర్కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే. హెపటైటిస్ బీ ఇటీవల కాలంలో కనుగొన్న వైరస్ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్ బ్లుంబర్గ్ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్ బీకి సింథటిక్ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్ క్యాన్సర్‌ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్ టీకాగా పేర్కొంటారు. -
టైఫాయిడ్‌కు విద్యార్థిని బలి
నడుస్తూ వెళ్లి.. నిర్జీవమై వచ్చింది గోపాలపురంలో విషాద ఛాయలు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి.. ఎన్నో ఆశలతో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను టైఫాయిడ్ రూపంలో మృత్యువు కాటేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. రావులపాలెం మండలం గోపాలపురంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. – గోపాలపురం (రావులపాలెం) గోపాలపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఓదూరి సత్యనారాయణ, లక్ష్మి కుమార్తె కాంచన(16) రావులపాలెంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల కిత్రం ఆమె జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు రావులపాలెంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. టైఫాయిడ్ సోకినట్టు వైద్యుడు నిర్ధారించారు. నాలుగు రోజుల పాటు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. తీవ్ర తలనొప్పి, వాంతులతో బాలిక పరిస్థితి విషమించడంతో, తిరిగి అదే ఆస్పత్రికి సోమవారం సాయంత్రం తీసుకువెళ్లారు. ఆమెను రాజమండ్రిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించింది. చదువులో మేటి వ్యవసాయ కూలీ సత్యనారాయణ, లక్ష్మి దంపతులకు వెంకటేష్, కాంచన సంతానం. పేద కుటుంబానికి చెందిన కాంచన చదువులో రాణించింది. పదో తరగతితో చదువు మానేసిన వెంకటేష్ తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబంలో ఎవరూ పెద్ద చదువులు చదవకపోవడంతో కాంచన బాగా చదవాలని కష్టపడేది. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాuý శాలలో ఈ ఏడాది మార్చిలో పదో తరగతిలో ఉత్తమ పాయింట్లు పొంది, పాఠశాల ద్వితియ స్థానంలో నిలిచింది. దాతలు ఇచ్చిన నగదు ప్రోత్సాహంతో రావులపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరింది. ఆమె కల తీరకుండానే తనువు చాలించింది. ఆ ఇంజెక్షనే ప్రాణం తీసింది జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు చేసిన ఇంజెక్షనే తమ కుమార్తెను విషమ పరిస్థితిలోకి నెట్టిందని కాంచన తల్లిదండ్రులు విలపించారు. సోమవారం ఆస్పత్రిలో డెంగీ సోకిందేమోనని కాంచనకు వైద్య పరీక్షలు చేశారని, డెంగీ లేదని టైఫాయిడ్ మాత్రమే ఉందని చెప్పి ఇంజెక్షన్ చేశారని పేర్కొన్నారు. కాసేపటికి ఆమె నోటి వెంట, ముక్కు వెంట నురుగలు వచ్చి అపస్మారకస్థితికి చేరిందన్నారు. అక్కడి వైద్యులు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారన్నారు. అక్కడ రూ.30 వేలు కట్టించుకుని, తమ కుమార్తెను వైద్యానికి తీసుకువెళ్లారని, తెల్లవారుజామున తమ కుమార్తె చనిపోయిందని చెప్పారని కన్నీరుమున్నీరుగా విలపించారు. గత నెల 25న పుట్టిన రోజు చేసుకున్న కాంచన సోమవారం వినాయక చవితి పూజలో కూడా పాల్గొందని, నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లిన ఆమె నిర్జీవమై ఇంటికి చేరిందని రోదించారు. ఈ సంఘటనతో గోపాలపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టైఫాయిడ్ పాజిటివ్ కాంచనకు కొద్దిరోజుల కిత్రం వైద్య పరీక్షలు నిర్వహించగా, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందని గోపాలపురం పీహెచ్సీ వైద్యాధికారి ఎం.శివాజీ చెప్పారు. గ్రామంలో ఐదు బృందాలతో సర్వే నిర్వహించగా, ఎవరికీ టైఫాయిడ్ కానీ, డెంగీ కానీ సోకలేదని పేర్కొన్నారు.