Taiwan tour
-
‘ఇక చాలు ఆపండి’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్ మార్షా బ్లాక్బర్న్. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం -
తైవాన్‌లో మరో కీలక నేత పర్యటన.. చైనాను అమెరికా రెచ్చగొడుతోందా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసీ పర్యటన తర్వాత తైవాన్ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్‌లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ను బయపడుతున్న ఈ తరుణంలోనే అమెరికా గవర్నర్ తైపీలో పర్యటించారు. తైపీతో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్‌లో భాగంగా ఆదివారం తైవాన్ చేరుకున్నారు అమెరికాలోని ఇండియాన రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హోల్కోంబ్. తైవాన్ అధ్యక్షుడిని సోమవారం కలిశారు. కొద్ది రోజుల క్రితం స్పీకన్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది చైనా. దాంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌కు మద్దతుగా దౌత్యపరమైన చర్యలు చేపడితే ఊరుకునేది లేదని, తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా గవర్నర్ హోల్కోంబ్తో భేటీ అయ్యారు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్. బీజింగ్ మిలిటరీ డ్రిల్స్‌పై మాట్లాడారు. తైవాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం ప్రపంచ నిరంకుశత్వ నిరంతర విస్తరణవాదాన్ని ఎదుర్కొంటున్నాం. తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి సైనిక బెదిరింపులను తైవాన్ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి అన్ని విధాల సహకారం అందించాలి.’ అని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ పేర్కొన్నారు. తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు అమెరికా గవర్నర్ హోల్కోంబ్. మరోవైపు.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లేలోపు సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో హోల్కోంబ్ భేటీ అవుతారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్! -
తైవాన్ టూర్ ఎఫెక్ట్: నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనపై ముందు నుంచే మండిపడుతోంది చైనా. అయినప్పటికీ.. తైపీలో పర్యటించారు పెలోసీ. దీంతో అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్ దేశం. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ‘చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకోవటం తీవ్రమైన అంశం. చైనా సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణచివేయటమే. అలాగే.. తైవాన్‌లో శాంతి, సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. చైనాలోని షింజియాంగ్, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈఏడాది మార్చిలో ప్రకటించింది చైనా. ఈ జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోవ్‌లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి. ఇదీ చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్ -
‘తైవాన్’పై చైనా వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న అమెరికా!
తైపీ: అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్‌లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సైన్యం చూస్తూ కూర్చోదని ఇప్పటికే హెచ్చరించింది చైనా. డ్రాగన్ హెచ్చరికలతో అప్రమత్తమైంది అమెరికా. స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది. తైవాన్, ఫిలిప్పీన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఈ రీగన్ నౌక.. గైడెడ్ మిసైల్స్, యూఎస్ఎస్ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్ఎస్ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్‌డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు. చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు స్పీకర్ నాన్సీ పెలోసీ. మంగళవారం రాత్రికి తైవాన్‌లోని తైపీకి చేరుకుంటారని సమాచారం. పెలాసీ పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది అమెరికా. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్‌కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. తైవాన్‌కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చూడండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
తెలంగాణకు ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్!
- తైవాన్ పర్యటనలో ‘ఫాక్స్‌కాన్’ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ - హైదరాబాద్‌లో యూనిట్లు నెలకొల్పాలని విజ్ఞప్తి - త్వరలో తమ ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు సంస్థ సీఈవో అంగీకారం సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, పారిశ్రామిక విధానాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్‌కు చెందిన యఫ్హెచ్ మొబైల్స్ కంపెనీ సీఈవో డబ్ల్యుయచ్ తాంగ్ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ యూనిట్లను నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తమ ప్రతినిధుల బృందాన్ని త్వరలోనే హైదరాబాద్ పంపనున్నట్లు మంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం టెక్ గ్రూప్ చైర్మన్ ధియోడర్ హువాంగ్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే.. ైతె వాన్ ఆర్థిక వ్యవహారాల ఉపమంత్రి షి.చావోతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తైవాన్ నుంచి పెట్టుబడిదారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. శనివారంతో తైవాన్ పర్యటనను ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.