డ్రైవింగ్ చేస్తూ తన కారు కింద తనే పడింది
వాష్టింగ్టన్: వాషింగ్టన్లో వింత సంఘటన చోటుచేసుకుంది. సొంతకారు కిందే ఓ యువతి పడింది. విచిత్రం ఏమిటంటే ఆ కారును ఆ సమయంలో డ్రైవింగ్ చేసింది కూడా ఆ యువతే.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. మరేం లేదు.. వాషింగ్టన్ లోని బర్లింగ్టన్ లో ఓ యువతి తన కారుకు గ్యాస్ నింపించుకొని తిరిగి ప్రయాణమైంది.
ఓ జంక్షన్ వద్దకు వెళ్లాక తన కారు గ్యాస్ మూతపెట్టానో లేదో అని కిందికి దిగింది. అయితే, కారు ఇంజిన్ ఆపకుండా అలా గేర్లో ఉంచే కిందికి దిగడంతో అది కాస్త ముందుకు కదలడం ప్రారంభించింది. దీంతో తిరిగి తన కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించి అదే కారు కిందపడింది. దీంతో ఆ కారు తన కాలుపై నుంచి వెళ్లి అలా నెమ్మదిగా జంక్షన్ దాటుకుంటూ అవతలి వైపు ఉన్న ఓ చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. ఇది చూసిన వారంతా ఆమె సహాయంగా వచ్చారు. అయితే, ఎలాంటి గాయాలు అవలేదని తెలిసింది.