Taliban fighters
-
తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు
మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛపై తాలిబన్ల హామీలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. అఫ్గాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ జడ్జి వారి దారుణాలను వెల్లడించారు. అమెరికాలో నివాసముంటున్న నజ్లా ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు వండిన వంట బాగాలేదన్న కారణంగా ఉత్తర అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. చదవండి : Afghanistan: మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు తమకు ఆహారాన్ని అందించాలని అక్కడి ప్రజలను తాలిబన్లు ఒత్తిడి చేస్తున్నారని, స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ అధీనంలోని ప్రాంతాల్లోని యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలంటూ స్థానిక కుటుంబీకులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఒకపక్క ఇన్ని దారుణాలకు పాల్పడుతూ మరోపక్క మహిళలు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని బూటకపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ మండిపడ్డారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. అఫ్గాన్ జాతీయ జండా పట్టుకున్న వ్యక్తిని చావబాదడం, పోలీసు అధికారి ఒకరిని కాల్చిచంపడం, మైనార్టీ వర్గాలను చిత్రహింసలు పెట్టడం వంటి చర్యలతో తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. -
అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ కీలక నిర్ణయం!
కాబూల్: జైలు నుంచి తాలిబన్లను విడుదల చేసేందుకు అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దశలవారీగా వారిని విడుదల చేయాలంటూ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి సిదిఖ్ సిద్ధిఖీ ధ్రువీకరించారు. దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని షరతు విధించింది. తొలుత ఇందుకు అంగీకరించని అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ... మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.(అమెరికా– తాలిబన్ మధ్య చారిత్రక ఒప్పందం) ఈ విషయం గురించి అష్రాఫ్ ఘనీ అధికార ప్రతినిధి సిదిఖ్ సిద్దిఖీ మాట్లాడుతూ.. శనివారం నుంచి తాలిబన్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొదటి రోజు వంద మంది చొప్పున.. 1500 మందిని రిలీజ్ చేస్తామన్నారు. ఇక ఆఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన తర్వాత... రెండు వారాలకు మిగిలిన 3500 మందిని 500 మంది చొప్పును విడుదల చేస్తామని వెల్లడించారు. హింసకు పాల్పడబోమంటూ తాలిబన్లు హామీ ఇచ్చిన మేరకే ఈ నిర్ణయం సాఫీగా అమలువుతుందనే షరతుతో ముందుకు సాగుతామన్నారు. తాలిబన్ల విడుదలకు సంబంధించిన డిక్రీపై అధ్యక్షుడు ఘనీ సంతకం చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలోనే తాలిబన్ల విషయంలో ఘనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం ఘనీ, ఆయన మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లాలు తామే ఆఫ్గనిస్తాన్ అధ్యక్షులం అంటూ పోటాపోటీగా ప్రమాణ స్వీకారోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘనీ పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నపుడు అక్కడ రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు చెక్‌పెట్టేందుకు ఘనీ వేగంగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో కుదుర్చుకున్న చారిత్రక శాంతి ఒప్పందానికి భారత్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. President Ghani has signed the decree that would facilitate the release of the Taliban prisoners in accordance with an accepted framework for the start of negotiation between the Taliban and the afghan government. Details of the decree will be shared tomorrow. — Sediq Sediqqi (@SediqSediqqi) March 10, 2020 -
రంజాన్‌నాడు నెత్తురోడిన అఫ్గాన్
జలాలాబాద్: రంజాన్ రోజు అఫ్గానిస్తాన్ నెత్తురోడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రజలు, తాలిబన్ ఫైటర్లు కలిసి జరుపుకున్న వేడుకలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 21 మంది మృతిచెందగా 41 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తాలిబన్లే ఉన్నారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్లతో సర్కారు కుదర్చుకున్న కాల్పలు విరమణ ఒప్పందం ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ప్రభుత్వ ఒప్పందం నేపథ్యంలో అఫ్గాన్ భద్రతా దళాలతో కలిసి తాలిబన్ ఫైటర్లు, ప్రజలు ఆలింగనాలు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపిన కాసేపటికే ఈ దాడి జరిగింది. దాడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ మూడ్రోజుల కాల్పుల విరమణకు తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖున్జాదా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది గురువారం నుంచి ఆదివారం వరకు అమల్లో ఉంది.ఈ ఘటనకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపన కోసం అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలకు కొంతకాలంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. కాల్పుల విరమణకు తాలిబాన్లు అంగీకారం తెలిపారు. ఇంతలోనే తాలిబన్లు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది. -
రాకెట్లతో ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత
-
ఆర్మీ హెలికాప్టర్ కూల్చివేత: 8 మంది దుర్మరణం
కాబుల్: తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో అఫ్ఘానిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-16 యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. పైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. తాలిబన్ల ఆధిపత్యంలోని బగ్లామ్ ఫ్రావిన్స్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ఆదివారం ఆర్మీ అధికారులు ప్రకటించారు. బగ్లామ్ సహా కొన్ని ఉత్తర ప్రాంతంలు చాలా ఏళ్లుగా తాలిబన్ల ఆధిపత్యం కిందే కొనసాగుతున్నాయి. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోన్న తాలిబన్లను అంతం చేసేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. కొద్ది రోజుల కిందటే యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే భూతలంలో పోరాడుతున్న సైనికులకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తోన్న హెలికాప్టర్ ను ఉగ్రవాదులు పేల్చేశారు. హెలికాప్టర్ గాలిలోనే పేలిపోవడంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని అధికారులు పేర్కొన్నారు.