tallest man
-
World tallest man:పొడవులో ఘనాపాఠి
అక్రా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్ సేన్ గతంలోనే గిన్నిస్ ప్రపంచ రికార్డులకెక్కాడు. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు సులేమనా అబ్దుల్ సమీద్. అందరిలా సాధారణ ఎత్తు ఉన్న సమీద్ 22 ఏళ్ల వయసులో వేగంగా పెరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి ఎత్తు కొలవమంటే వారి దగ్గర సరిపడా టేప్ లేదు. ఒక ఎత్తయిన కర్ర తీసుకుని ఎత్తు తేల్చారు. అప్పుడు అతని ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు. గిన్నిస్‌లో స్థానం సంపాదించిన సుల్తాన్(ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు)ను త్వరలోనే దాటేస్తావని అందరూ తెగ పొగిడేశారు. సమీద్ ఇంకా ఎత్తు పెరుగుతుండటం గమనార్హం. కాగా ‘మార్ఫాన్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జన్యుసంబంధ వ్యాధి కారణంగా తీవ్ర గుండె సమస్యలు తలెత్తుతాయి. మెదడుకు శస్త్రచికిత్స చేసి ఇతని పెరుగుదలను ఆపాల్సి ఉంది’ అని వైద్యులు తెలిపారు. -
ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా
ఇస్లామాబాద్ : క్రికెట్ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుంచి మొదలుకొని సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటతీరును చూశాం.. చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆటలో తమ నైపుణ్యతను అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇలా ఏదో ఒక దాంట్లో తమ మెళుకువలను చూపెడుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, ఇయాన్ బోథమ్ సహా ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఇదే కోవలోకి వస్తారు. కానీ కొంతమంది మాత్రం ప్రదర్శనతో కాకుండా తమ రూపురేఖలతో ఆకట్టుకుంటారు. క్రికెట్లో అత్యంత పొడవైన క్రికెటర్‌గా పాక్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇర్ఫాన్ పొడవు .. 7 అడుగుల 1అంగుళం. (చదవండి : ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా) 2010లో పాక్ వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఇర్ఫాన్ తన బౌన్సర్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ రికార్డును పాక్‌కే చెందిన ముదస్సార్ గుజ్జర్ అనే కుర్రాడు బద్దలు కొట్టాడు. గుజ్జర్ పొడవు 7 అడుగుల 6 అంగుళాలు. ముదస్సార్ గుజ్జర్ గతేడాది నవంబర్‌లో లాహోర్ క్వాలాండర్స్ డెవలప్మెంట్ లో చేరి కోచ్, ట్రైనర్ల సహాయంతో బౌలర్‌గా శిక్షణ పొందుతున్నాడు. గుజ్జార్ ఎక్కువ పొడవు కావడంతో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కఠోర సాధన చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పాక్ తరపున దేశవాలి క్రికెట్లో ఆడి పేరు సంపాదించి ఆపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్నాడు. తాజాగా ముదస్సార్ గుజ్జార్‌ను కలిసిన ఒక జర్నలిస్ట్ అతనితో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ' ముదస్సార్ గుజ్జార్ పొడవు.. 7 అడుగుల 6 అంగుళాలు, షూ సైజ్ 23.6.. ఇంత పొడవు క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా.. మీట్ విత్ ముదస్సార్ గుజ్జార్' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(చదవండి : ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) సాధారణంగా విండీస్ నుంచి వచ్చే క్రికెటర్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆరు అడుగులకు పైగానే ఉంటారు. మన టీమిండియాలో కూడా అత్యంత పొడగరి ఎవరంటే ఇషాంత్ శర్మ పేరు టక్కున చెబుతారు. ఇషాంత్ శర్మ పొడవు 6 అడుగుల 5అంగుళాలు. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత పొడవైన క్రికెటర్లుగా మహ్మద్ ఇర్ఫాన్(పాకిస్తాన్), జోయల్ గార్నర్(వెస్టిండీస్), బ్రూస్ రీడ్(ఆస్ట్రేలియా), కర్ట్లీ ఆంబ్రోస్(వెస్టిండీస్), టామ్ మూడీ( ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), క్రిస్ ట్రెమ్లెట్( ఇంగ్లండ్), పీటర్ ఫుల్టన్(న్యూజిలాండ్), షాహిన్ ఆఫ్రది(పాకిస్తాన్), ఇషాంత్ శర్మ( ఇండియా) తొలి పది స్థానాల్లో ఉంటారు. -
సీఎం సహాయం కోసం అత్యంత పొడగరి
లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి దేశంలోనే అత్యంత పొడగరిగా గుర్తింపు పొందారు. ఆయన ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. ధర్మేంద్ర గత కొద్దిరోజులుగా తుంటి సమస్యతో బాధపుడుతున్నారు. వైద్యులను సంప్రదించగా తుంటి మార్పిడి ఆపరేషన్ చేయాలని, ఇందు కోసం దాదాపు రూ. 8లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేని ధర్మేంద్ర తనకు సహాయం చేయాలని సీఎం యోగిని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ధర్మేంద్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవటానికి ఆయన కార్యాలయానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు. దీంతో నేను వెనక్కు తిరిగిరాక తప్పలేదు. నా ఆపరేషన్‌కు కొంత సహాయం చేయాలని ముఖ్యమంత్రికి గతంలోనే లేఖ రాశాను. ఆయన ప్రభుత్వం తరుపున సహాయం చేస్తానని చెప్పారు. సహాయం తప్పకుండా అందుతుందనే నమ్మకం నాకుంది.’’ అని ఆయన అన్నారు. -
దేశంలోనే పొడగరి..జీవితం ఎలామరి?
యశవంతపుర: ఇతడి పేరు మారుతీ హనుమంత్... అయితే ఏమిటీ విశేషం అని అడగొచ్చు. ఇతని ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. వయసు 36 ఏళ్లు. ఊరు కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా చింతాకి గ్రామం. భారతదేశంలోనే ఎత్తైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. మారుతీని చూసిన కొత్తవారు అతడితో ఫోటోలు తీయించుకొని మురిసిపోతున్నారు. సాధారణ వ్యక్తి అతడి ముందు నిలుచుంటే మరుగుజ్జు అయిపోతాడు. మారుతి ఎత్తు ఎక్కువే అయినా, కుటుంబం మాత్రం నిరుపేదది. తల్లీ వీరవ్వ, ముగ్గురు సోదరులు రోజూ కష్టపడి కూలీ చేసి సంపాదిస్తేగానీ మారుతీకి పూటగడవటం కష్టం. నడుం వంచి పని చేయలేడనే నెపంతో గ్రామంలోనివారు ఎవరూ మారుతీని పనికి పిలవటం లేదు. నడిచేటప్పుడు భూమికి రాసుకుని రెండు కాళ్లకు పుండు కావటంతో నడవటం కూడా అతడికి కష్టంగా మారింది. ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో రూ. వెయ్యి పెన్షన్ అందిస్తోంది. ఒక్క సెంట్ కూడా భూమి లేకపోవటంతో భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని కోరికగా ఉన్నా ‘తగిన’సంబంధాలు దొరకటంలేదు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇల్లే ఆశ్రయం. ఇంత ఎత్తు ఉన్నా దానివల్ల తనకు, కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదని మారుతి, సోదరులు, తల్లి ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మారుతీ తల్లి ప్రభుత్వాన్ని కోరారు. -
‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’
ముంబై: ఒడ్డూ పొడువు, ముక్కూ మూతి చక్కంగా ఉన్న టీనేజ్ కుర్రాళ్లకే గర్ల్ ఫ్రెండ్ దొరకడం కష్టం. అటువంటిది ఆరడుగుల ఏడు అంగుళాల పొడవున్న బక్క పలచటి 14 ఏళ్ల యశ్వంత్ రౌత్‌కు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే మాటలా! పైగా ఈ కుర్రాడు కచ్చితంగా ఎనిమిది అడుగుల వరకు పొడుగు పెరుగుతాడని డాక్టర్లు చెబుతున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన స్కూల్ బాయ్ యశ్వంత్‌కు తన పెళ్లికి సరిజోడు దొరకదని ఇప్పటి నుంచే బెంగ పట్టుకున్నది. తాను ఎనిమిది అడుగుల వరకు పెరిగితే పెళ్లికి సరిజోడు దొరక్క పోవచ్చని, బహూశ ఆ వయస్సులో పెళ్లి కూడా జరక్క పోవచ్చని బాధ పడుతున్నాడు. కనీసం ఈ ఎత్తుకు ఈ వయస్సులోనైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుండునని, తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతున్నదని తనను కలసిని ఓ మీడియాతో వాపోయాడు. ‘నా కాళ్లకు సరిపడ 15 నెంబర్ బూట్లే కష్టంగా దొరికాయి. నాకు టైలర్ ప్యాంట్ కుట్టాలన్నా ఇబ్బంది పడతారు. ఇక నిత్య జీవితంలో నేను పడే ఇబ్బందులు అంతా ఇంతా కావు. స్కూల్ డెస్క్‌లో సరిగ్గా కూర్చోలేను. తరగతి గదిలోకి వెళ్లాలన్నా, ఇంట్లో గుమ్మాలు దాటాలన్నా వంగి, వంగి ఇబ్బంది పడాల్సిందే. మంచం మీద పడుకుంటే చేతులు, కాళ్లు బయటే. బస్సెక్కాలంటే టాప్ లేచిపోద్ది. కారులో సరిగ్గా కూర్చోలేను. నలుగురిలోకి వెళితే అందరూ నావైపే చూస్తారు. కొందరు లంబూ అంటారు. కొందరు అమితాబ్ బచ్చన్ అంటారు. అప్పుడప్పుడు నన్ను వీధిలో నిలబెట్టి ఫొటోలు తీసుకుంటుంటే మాత్రం సెలబ్రిటి అయిపోయాననిపిస్తుంది. పొడుగు పెరగాలని అనుకున్నాను. కానీ మరింతలా కాదు. నా పొడువు బాస్కెట్ బాల్ ఆటకు సరిపోతుంది కనుక బాస్కెట్ బాల్ క్రీడాకారుడిని కావాలని, ఏదో రోజు భారత్ తరఫున ఆడాలని కోరుకుంటున్నాను’ అని యశ్వంత్ తన గురించి తాను చెప్పుకొచ్చాడు. యశ్వంత్ తండ్రి బ్రహ్మదేవ్ రౌత్ ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలే. తల్లి సుమన్ రౌత్ నాలుగు అడుగుల ఐదు అంగుళాలే. వారికి పుట్టిన యశ్వంత్ ఇంత పొడువు అవుతారని వారు కలలో కూడా అనుకోలేదు. బిడ్డ కడుపులో ఉండగా, ఏం తిన్నావంటూ ఇరుగు పొరుగు వారు అప్పుడప్పుడు తనను అడుగుతుంటారని సుమన్ తెలిపారు. ఏం తిన్నానో తనకే గుర్తు లేదని, ఇక తానేమి చెబుతానని అన్నారు. ప్రస్తుతం సామాజికంగా తన కొడుకుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. అందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని వారు సూచించారని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కెవిన్ బ్రాడ్ఫోర్డ్ 18 ఏళ్ల లోపు కేటగిరీలో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన పొడవు ఏడు అడుగుల ఒక అంగుళం ఉన్నారు. ఆయన పొడవును క్రాస్ చేశాక యశ్వంత్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఇక భారత్‌లో అత్యంత పొడవైన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 32 ఏళ్ల ధర్మేంద్ర సింగ్. ఆయన పొడవు ఎనిమిది అడుగుల ఒక అంగుళం.