తమిళ కూలీల కోసం కూంబింగ్
లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్జిల్లా): ఎర్రచందనం తరలించడానికి భారీ ఎత్తున తమిళ కూలీలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు విసృత స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు ప్రవేశించారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.