Tamil Nadu Chief Minister J Jayalalithaa
-
'పులిపిల్లలకు అమ్మ పేరు పెట్టింది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగు పులిపిల్లలకు నామకరణం చేశారు. ఆదివారం ఆమె చెన్నైలోని వండలూర్ లోని అరిగ్నార్ అన్నా జూపార్క్‌ను సందర్శించిన సందర్భంగా నమృత అనే తెల్ల పులికి కొత్తగా జన్మించిన నాలుగు తెల్ల పులిపిల్లలకు పేర్లు పెట్టారు. నాలు పిల్లల్లో రెండు మగ పులిపిల్లలు కాగా, రెండు ఆడ పులిపిల్లలు. రెండు మగ పులిపిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టిన జయ ఆడపులిపిల్లలకు కాలా, మాలా అని పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ ఏడాది జూన్ నెలలో నాలుగు తెల్ల పులిపిల్లలకు జయ పేరుపెట్టిన విషయం తెలిసిందే. -
ప్రధానికి జయలలిత లేఖ
తమ రాష్ట్ర డీజీపీ కె రామానుజానికి జరిగిన అవమానంపై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ సంధించారు. ఎస్పీజీ సిబ్బంది తమ డీజీపీని అడ్డుకోవడాన్ని ఆమె బట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని రాసిన లేఖలో జయలలిత కోరారు. పుదుకోట్టై జిల్లా తిరుమయంలో భెల్ అనుబంధ పైపుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవ నిమిత్తం తమిళనాడుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు వెళ్లిన రామానుజాన్ని ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. పాస్ లేదనే కారణంతో ఆయనను అడ్డగించారు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండిపోయారు. డీజీపీకి అవమానం ఎదురు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రధాన అధికారిని అవమానపరిచే రీతిలో ఎస్పీజీ వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రొటోకాల్ అధికారి అనుజార్జ్ను వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను జార్జ్‌ను కోరడం విశేషం.