
'పులిపిల్లలకు అమ్మ పేరు పెట్టింది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగు పులిపిల్లలకు నామకరణం చేశారు. ఆదివారం ఆమె చెన్నైలోని వండలూర్ లోని అరిగ్నార్ అన్నా జూపార్క్ను సందర్శించిన సందర్భంగా నమృత అనే తెల్ల పులికి కొత్తగా జన్మించిన నాలుగు తెల్ల పులిపిల్లలకు పేర్లు పెట్టారు. నాలు పిల్లల్లో రెండు మగ పులిపిల్లలు కాగా, రెండు ఆడ పులిపిల్లలు.
రెండు మగ పులిపిల్లలకు దేవా, నకులా అని పేర్లు పెట్టిన జయ ఆడపులిపిల్లలకు కాలా, మాలా అని పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ ఏడాది జూన్ నెలలో నాలుగు తెల్ల పులిపిల్లలకు జయ పేరుపెట్టిన విషయం తెలిసిందే.