Tamil nationals
-
‘ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు’
తమిళుల ఆరాధ్యదైవం, ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా?.. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోమవారం తంజావూరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత కింది సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ జాతీయవాది, కాంగ్రెస్ మాజీ నేత అయితే పళ నెడుమారన్ తాజాగా.. ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ ప్రకటించారు. తమిళ ప్రజల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం(ఎల్టీటీఈ) నేత త్వరలోనే వస్తాడంటూ ఉలగ తమిళర్ పెరమైప్పూ నేత తమిళ నెడుమారన్ ప్రకటించడం గమనార్హం. ప్రపంచంలో ఉన్న తమిళులందరికీ శుభవార్త. ఆయన బతికే ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి నేపథ్యంలో .. తమిళ దేశీయ తలైవర్(తమిళ జాతీయ వాద నేత) ప్రభాకరన్ బయటకు రావాల్సిన అవసరం వచ్చిందని, తాను జీవించి లేనన్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ నెడుమారన్ వ్యాఖ్యానించారు. తమిళుల అభ్యున్నతి కోసం ప్రభాకరన్ ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చిందని, ఆయనకు తమిళనాడులోని రాజకీయపార్టీలు.. ప్రపంచంలోని ప్రజలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాలని వ్యాఖ్యానించారాయన. అయితే.. అయితే ప్రభాకర్ బతికే ఉన్నాడనేందుకు ఆధారాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన దాటవేత ప్రదర్శించారు. అయితే.. తాము ఇప్పటికీ టచ్‌లో ఉన్నామని, ఈ సమయంలో అంతకు మించి ఇంకేం చెప్పలేమంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమం ప్రారంభించిన ప్రభాకరన్.. 2009 మే 18వ తేదీన ముల్లైవైతూ జిల్లా ముల్లైవైక్కల్ వద్ద శ్రీలంక బలగాల చేతుల్లో మరణించినట్లు ప్రకటన వెలువడింది. ప్రభాకరన్ చనిపోయాడంటూ సాక్ష్యంగా ఒక వీడియో, కొన్ని ఫొటోలను సైతం రిలీజ్ చేసింది. -
మోడీతో జయలలిత భేటీ
ప్రధానితో మొదటిసారి సమావేశమైన తమిళనాడు సీఎం న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళ జాతీయులపై జరిగిన మారణకాండను ఖండిస్తూ ఐక్య రాజ్య సమితిలో భారత్ ఒక తీర్మానం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత డిమాండ్ చేశారు. ఆ జాతి హత్యాకాండకు కారణమైనవారిని బాధ్యులుగా గుర్తించి శ్రీలంకలోని తమిళులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరారు. ప్రధాని మోడీతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనతో జయలలి త భేటీ కావడం ఇదే ప్రథమం. ప్రధాని కార్యాలయంలో ఇరువురు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన 65 పేజీల వినతిపత్రాన్ని ఆమె ప్రధానికి అందించారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయింపు, చెన్నై మెట్రో రైలు విస్తరణ, కావేరీ జల నిర్వహణ బోర్డు ఏర్పాటు.. మొదలైన డిమాండ్లు అందులో ఉన్నాయి. పాక్ జలసంధిలో ఉన్న చిన్న ద్వీపం ‘కచ్చతీవు’ అంశాన్ని కూడా జయలలిత ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. 1974లో దాన్ని శ్రీలంకకు అప్పగించారని, ఆ ద్వీపాన్ని మళ్లీ భారత్ తన ఆధీనంలోకి తీసుకుని, తమిళనాడులోని మత్స్యకారులకు అక్కడ చేపల వేటకు హక్కును కల్పించాలని ఆమె మోడీని కోరారు. అనంతరం మీడి యా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఎన్డీఏలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు.. ఆ ప్రతిపాదనేదీ రాలేదన్నారు. ఎన్డీఏకు బయటనుంచి మద్దతిచ్చే ఆలోచనుందా? అన్న ప్రశ్నకు.. ఎన్డీఏకు ఆ అవసరం లేదని, బీజేపీకే సొంతంగా మెజారిటీ ఉందన్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం’ అన్నారు. బీజేపీకి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ.. 243 సభ్యుల రాజ్యసభలో మాత్రం బీజేపీ సభ్యులు కేవలం 42 మందే ఉన్నారు.