Tamila Manila Congress
-
కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై
-
కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై
చెన్నై: ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీకే వాసన్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు జీకే వాసన్ ప్రకటించారు. తన తండ్రి జీకే ముపనార్ స్థాపించిన తమిళ మనిలా కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నంలో వాసన్ ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి, విధానాలపై జీకే వాసన్ దుమ్మెత్తి పోశారు. -
కాంగ్రెస్ అధిష్టానంపై తమిళ కాంగ్రెస్ నేత అసహనం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిస్టానంపై తమిళ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి మొదలైంది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, విధానాలపై జీకే ముపనార్ కుమారుడు జీకే వాసన్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో వాసన్ ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పునరుద్ధరణకు వాసన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తండ్రి ముపనార్ పార్టీ టీఎంసీని పునరుద్ధరించి.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వ్యూహాలు పన్నుతున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.