కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై
చెన్నై: ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీకే వాసన్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు జీకే వాసన్ ప్రకటించారు.
తన తండ్రి జీకే ముపనార్ స్థాపించిన తమిళ మనిలా కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నంలో వాసన్ ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి, విధానాలపై జీకే వాసన్ దుమ్మెత్తి పోశారు.