tana summit
-
పెన్సిల్వేనియా తానా సభల్లో తన్నులాట
-
US : తానా సభల్లో తన్నుకున్న లోకేశ్, జూ.ఎన్టీఆర్ వర్గాలు
పెన్సిల్వేనియా, అమెరికా : అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం లోకేష్ నాయకత్వంపై వ్యక్తమైన విమర్శలే కారణమని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ‘జై ఎన్టీఆర్’అని నినదించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వర్గం దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. అ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంతవరకు టీడీపీకి మనుగడ లేదని, 2024లోనూ మరోసారి పరాజయం ఖాయమని కొందరు ఎన్నారైలు వాదించినట్లు సమాచారం. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకునే లోకేష్ కు బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీంతో కలవరం చెందిన చంద్రబాబు వర్గం దాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తానాకు ఈ ఘటన మాయని మచ్చలా మిగిలింది. ఘనంగా ప్రారంభం.. అంతలోనే వివాదం పెన్సిల్వేనియాలో తానా 23వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన అనంతరం తానాలోని కొందరు ప్రముఖులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. కర్రలు విసురుకుంటూ.. సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చింది. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవకు దిగారు. కొందరు తానా ముఖ్యులు ఆపడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి స్థానిక సెక్యూరిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం రేగడంతో ముష్టి యుద్ధానికి దిగాయి. వివాదం శృతి మించడంతో కొందరు అందుబాటులో ఉన్న కర్రలను విసిరారు. ప్రతిష్టాత్మక తానా సంస్థను రాజకీయ సంస్థగా మార్చిన ఘనత చంద్రబాబుదేననే విమర్శలున్నాయి. నిధుల సేకరణ కోసం తానాను ఆయన కామధేనువులా మార్చుకున్నారు. గొడవకు కారణం లోకేష్ సమర్థతేనా? తానాకు హాజరయిన కొందరు సభ్యుల్లో గొడవ ముదరడానికి ప్రధాన కారణం తెలుగుదేశం రాజకీయాలే అని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం చంద్రబాబు, లోకేషేనని.. మళ్లీ 2024 ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంత కాలం బాగుపడే అవకాశం లేదని చెప్పుకున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారని, అయితే తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటోన్న లోకేష్ కు అంత సీన్ లేదని, లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే గానీ పార్టీ బాగుపడదని కొందరు వాదించినట్టు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ఎక్కడికెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ పగ్గాలు జూనియర్ కు ఇస్తేనే.. బాగుంటుందని ఎక్కువ మంది వాదించారు. దీంతో చంద్రబాబు వర్గంలో కలవరం మొదలై, దాడులకు దిగే దుస్థితి వచ్చినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
ఇంటర్నెట్లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’
‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ను ఈ ఏడాది ఇంటర్నెట్లో ప్రారంభిస్తున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి వెల్లడించారు. మే 31నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని సాహితీ ప్రియులంతా పాల్గొనాలని సూచించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేస్తోందని అన్నారు. ఇకపై ప్రతి నెల చివరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (వలస కూలీలకు ఎన్ఆర్ఐల బస్సు ఏర్పాటు) మొదటి సమావేశం ఈ ఆదివారం (మే 31) నాడు రాత్రి 9.30 నిమిషాలకు (అమెరికా సమయం ఉదయం11:00) ప్రసారం కానుందని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ అన్నారు. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిధిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారని పేర్కొన్నారు. (చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది.. ) ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తం గా పోటీలు నిర్వహిస్తామని, మే నెల నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. (ఆమె లేకుండా ‘పని’ అవుతుందా! ) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశంలో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు. 1. Webex Link: https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40 2. Facebook: 3. Join by phone: USA: 1-408-418-9388 Access code: 798 876 407 -
స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ: జస్టిస్ రమణ
♦ అప్పుడే వారి సమస్యలకు సత్వర పరిష్కారం ♦ సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం: కొత్త అధ్యక్షుడు చౌదరి ♦ ఘనంగా ముగిసిన మహాసభలు డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: భారత్‌లో పెండింగ్‌లో ఉన్న 3 కోట్ల పై చిలుకు కేసుల్లో స్త్రీలపై జరిగిన అకృత్యాలకు సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. వాటి సత్వర పరిష్కారానికి స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల మూడో రోజు శనివారం డెట్రాయిట్లో స్త్రీల ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ప్రతి పది లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలుంటే అమెరికాలో 150 మంది ఉన్నారన్నారు. భారత్‌లో కోర్టుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉందన్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని భావి తరాలకు అందించాలంటే దాన్ని పిల్లలతో విధిగా సాధన చేయించాలని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఏదో పదేళ్ల వయసు దాకా నేర్పించి ఆ తర్వాత వదిలేస్తే తెలుగుకు అన్యాయం చేసినట్టేనని తానా సాహిత్య సభల్లో మాట్లాడుతూ అన్నారు. సుద్దాల అశోక్ తేజ ఆలపించిన నేలమ్మా పాటను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలకు న్యాయం చేశా: మోహన్ తానా అధ్యక్షునిగా తన బాధ్యతలను రెండేళ్లుగా విజయవంతంగా నిర్వహించానని నన్నపనేని మోహన్ అన్నారు. డెట్రాయిట్‌లోని కోబో సమావేశ మందిరంలో జరిగిన ముగింపు వేడుకల్లో కొత్త అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరికి ఆయన బాధ్యతలను అప్పగించారు. తానా కార్యవర్గం తనకు పూర్తి సహకారం అందించిందని కొనియాడారు. తానాలో మార్పులను సూచించాలంటే తనకు ఒక్క ఇ-మెయిల్ పంపితే చాలని చౌదరి అన్నారు. పాత ఆశయాలను కొత్త ఒరవడిలో ముందుకు తీసుకెళ్తానని, సేవా కార్యక్రమాలను భారీగా విస్తరిస్తానని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా వేమన సతీశ్, కార్యదర్శిగా తాతా మధు, కోశాధికారిగా వెన్నం మురళీ ఉంటారు. మూడు రోజుల తానా మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి. జస్టిస్ రమణ, సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, పురస్కార కమిటీ అధ్యక్షుడు కొర్రపాటి రఘులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానిం చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, బోండా ఉమా, సత్యప్రసాద్, కూన రవికుమార్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు విడిపోయినా అందరం ఒక్కటేనని, త్వరలోనే అన్నీ సమస్యలు సర్దుకుంటాయని అన్నారు. మణిశర్మ సంగీత విభావరితో కార్యక్రమం ముగిసింది. సుమ, ఝాన్సీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. నటులు అల్లరి నరేశ్, నారా రోహిత్, నిఖిల్, హీరోయిన్లు తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, రకుల్‌ప్రీత్‌సింగ్ హాస్య సంభాషణలతో అలరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు.