టీడీపీ అభ్యర్ధిగా తంగిరాల సౌమ్య నామినేషన్
విజయవాడ: నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తరపున తంగిరాల సౌమ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తంగిరాల సౌమ్య రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ పి.రజనీకాంతారావు అందచేశారు. తంగిరాల సౌమ్య ఇటీవల మరణించిన ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు కుమార్తె. తంగిరాల ప్రభాకర్ రావు మృతితో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
సౌమ్య నామినేషన్ దాఖలు సమయంలో ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ ఎమ్మల్యే శ్రీరాం రాజగోపాల్ ఆమె వెంట ఉన్నారు. నందిగామ ఉప ఎన్నిక కోసం ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేయలేదని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు.