అమితాబ్ అతిధిగా 'కొచ్చడయాన్' ప్రత్యేక షో!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్' చిత్రంపై ముంబైలో ఆదివారం సాయంత్రం ఓ ప్రత్యేక షోను నిర్వహించనున్నారు. రజనీ సర్ నటించిన 'కొచ్చడయాన్'పై ప్రత్యేకమైన కర్టైన్ రైజర్ కార్యక్రమం ఉంది అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు.
తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఈ చిత్రంలో రజనీ సరసన దీపికా పదుకొనె జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కొచ్చడయాన్ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు.
A special curtain raiser event of Rajinikanth Sir's #Kochadaiiyaan will be held this evening in Mumbai. Amitabh Bachchan is the chief guest.
— taran adarsh (@taran_adarsh) March 30, 2014