Tarun Sagar
-
జైన సాధువు తరుణ్ సాగర్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జైన సాధువు తరుణ్ సాగర్(51) శనివారం ఉదమం కన్నుముశారు. గత కొంత కాలంగా కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని రాధాపురి జైన ఆలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో మందులు తీసుకోవడం మానేశారు. సల్లేఖిని వ్రతం స్వీకరించి (ఆహారం ముట్టుకోకుండా ఉండడం) ఆయన ప్రాణత్యాగం చేశారని తెలుస్తోంది. ఆయన మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బాధను కలిగిస్తుందన్నారు. సమాజానికి తరుణ్ సాగర్ చేసిన బోధనలు మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. తరుణ్ సాగర్ జీ మహారాజ్ బోధనలు ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సురేశ్ ప్రభు,, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే , హర్యానా సీఎం ఖట్టర్ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 1967 జూన్ 26న మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో తరుణ్ సాగర్ జన్మించారు. ఆయన అసలు పేరు పవన్ కుమార్ జైన్. 13వ ఏటే ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. ‘కడ్వే ప్రవచన్’ పేరిట ఆయన ఇచ్చే ప్రసంగాలు ప్రాచుర్యం పొందాయి. హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడానికి ఆహ్వానం రావడంతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఆయన ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతుండటం, పాకిస్థాన్ వ్యవహార శైలి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. రేపిస్ట్ బాబాలను ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. -
33సార్లు క్షమాపణ చెప్పాడు!
న్యూఢిల్లీ: జైన దిగంబార సాధువు తరుణ్ సాగర్ హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడంపై ట్విట్టర్లో విమర్శలు చేసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఊహించనిరీతిలో వివాదాలకు కేంద్రమయ్యాడు. ట్విట్టర్లో అతడి విమర్శలు దుమారం రేపాయి. జైన దిగంబర బాబాను విమర్శిస్తావా? అంటూ చాలామంది ఆయనను వేలెత్తిచూపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం విశాల్ విమర్శలను ఖండించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సహా చాలామంది నెటిజన్లకు ఆయన క్షమాపణ చెప్పారు. ఏ మతం వారిని కించపరచడం, ఏ మతవిశ్వాసాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, మతాన్ని పరిపాలనను జోడించకూడదనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానని విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలు జైనుల మనోభావాలను దెబ్బతీస్తే.. అందుకు మనస్ఫూర్తిగా క్షమించాలని వినమ్రంగా కోరాడు. ట్విట్టర్లో తనను విమర్శించిన చాలామందికి విశాల్ క్షమాపణలు చెప్తూపోయారు. తాను చేసిన ఒక్క ట్వీట్ మీదనే ఆయన ఏకంగా 33సార్లు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విశాల్ ప్రకటించాడు. ఇన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడిగా, కార్యకర్తగా విశాల్ దద్లానీ కొనసాగారు. ఏకంగా కేజ్రీవాల్ తనను తప్పుపట్టడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటానని విశాల్ తెలిపారు. మరోవైపు ప్రముఖ జైన దిగంబర ముని తరుణ్ సాగర్ విశాల్ దద్లానీ విమర్శలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి తెలిపే హక్కు ఉంటుందని, విమర్శలను తాను పట్టించుకోబోనని తెలిపారు. -
క్షమాపణ చెప్పిన గాయకుడు
ముంబై: వివాదంలో చిక్కుకున్న గాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) నాయకుడు విశాల్ దద్లానీ రాజకీయాల నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించారు. జైన దిగంబర బాబా తరుణ్ సాగర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ‘నేను చేసిన వ్యాఖ్యలతో నా జైను స్నేహితులు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. క్రియాశీల రాజకీయాలకు, కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాన’ని విశాల్ ట్వీట్ చేశారు. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 26న దిగంబర బాబా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై విశాల్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన దిగంబర బాబా ఫొటో పోస్ట్ చేసి.. ‘ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే... ఇలాంటి న్యూసెన్స్ కు బాధ్యులవుతారు. మంచి రోజులు రావు. చెడ్డ రోజులే వస్తాయ’ని ట్వీట్ చేశాడు. విశాల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. తరుణ్ సాగర్ చాలా మంచి గురువు అని, ఆయన జైనులకే కాదు అందరికీ గురువు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. It feel bad that I hurt my Jain friends & my friends @ArvindKejriwal & @SatyendarJain .I hereby quit all active political work/affiliation. — VISHAL DADLANI (@VishalDadlani) 27 August 2016 -
అసెంబ్లీలో దిగంబర బాబా ప్రవచనాలు!
ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్యలాంటిది. భార్యపై భర్త నియంత్రణ ఏవిధంగా ఉంటుందో రాజకీయాలపై ధర్మం నియంత్రణ అదేవిధంగా ఉండాలంటూ ఆయన ప్రబోధించారు. స్త్రీ భ్రూణ హత్యలను నిర్మూలించాలని సూచించారు. పొరుగుదేశం పాకిస్థాన్‌పైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. 40 నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగాన్ని పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, సీఎం, గవర్నర్ శ్రద్ధగా విన్నారు. ఆయనే జైన దిగంబర బాబా తరుణ్ సాగర్. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్ సాగర్ బాబా గవర్నర్, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్‌పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. హర్యానా విద్యాశాఖ మంత్రి రాంవిలాస్ శర్మ సూచన మేరకు తరుణ్ సాగర్ 'కద్వే వచన్' పేరిట ప్రసంగించారు. 'రాజనీతిపై ధర్మం అంకుశం ఉండాల్సిందే. ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్య. తన భార్య సంరక్షించడమే ప్రతి భర్త కర్తవ్యం అవుతుంది. అదేవిధంగా భర్త అనుశాసనాన్ని స్వీకరించడమే ప్రతి భార్య ధర్మం అవుతుంది' అని ఆయన ప్రబోధించారు.