taruni metro station
-
తరుణి ఎగ్జిబిషన్ షురూ
-
వచ్చేస్తోంది ‘తరుణి’ ఎగ్జిబిషన్
జూబ్లీహిల్స్/సాక్షి,సిటీబ్యూరో: పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే ‘తరుణి ఎగ్జిబిషన్’ను మధురానగర్ మెట్రోస్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసమే ప్రత్యేకంగా మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దిన ఘనత నగర మెట్రో సొంతమని ఆయన అన్నారు. ఈ స్టేషన్ లోకి పురుషులు, మహిళలు ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ నిర్వహణ బాధ్యతలు మాత్రం మహిళలవేనన్నారు. లింగ సమానత్వ సాధన, మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఎగ్జిబిషన్ ప్రత్యేకతలివే.. ♦ ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చే వారికి ప్రవేశం ఉచితం. మొత్తం 130 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ♦ మహిళలకు సంబంధించిన అన్ని రకాల వినియోగ, గృహ అవసర వస్తువులు, చిన్నారులకు సంబంధించిన అన్నిరకాల వస్తువులు లభ్యమవుతాయి. ♦ ప్రదర్శనకు వచ్చేవారి సౌకర్యార్థం వెయ్యి ద్విచక్ర వాహనాలు, 100 కార్లు ఒకేసారి పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. ♦ ఎగ్జిబిషన్లో తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ♦ చిన్నారులకు ఆట పాటల కోసం ప్రత్యేక సదుపాయాలు, గేమ్స్‌జోన్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ♦ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ♦ సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ♦ మెట్రో ప్రయాణికులతో పాటు, రోడ్డు మార్గాన వచ్చేవారు సులువుగా ప్రదర్శన జరిగే ప్రాంతానికి చేరుకునే వీలు ♦ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మహిళలు, పురుషులకు వేర్వేరుగా యోగా శిక్షణ ♦ యోగా, పెయింటింగ్ నేర్చుకోవాలనే ఆసక్తిగల వారు ఈ నెల 24వ తేదీ లోగా పేర్లను నమోదు చేసుకోవాలి. వివరాలకు: 040–23388588, 23388587 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈమెయిల్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ ఎట్ ది రేట్ జిమెయిల్.కామ్‌లో కూడా చూడవచ్చు. -
మధురానగర్‌లో తరుణి మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: మధురానగర్ మెట్రో స్టేషన్లో మహిళలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు, వస్తువులు, సౌకర్యాలను కల్పించడంతోపాటు ఈ స్టేషన్ పేరును మహిళల కోసమే ప్రత్యేకంగా ‘తరుణి మెట్రో స్టేషన్’గా నిర్ణయించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్‌లోని దుకాణాలను సైతం మహిళలే నిర్వహిస్తారన్నారు. నగర మెట్రో ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, కాలుష్య రహిత ఈ–బైక్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం, ముఖ్యమెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ చేసే సదుపాయం కల్పించడం, మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం వంటి అంశాలకు నూతన సంవత్సరంలో పెద్దపీఠ వేస్తామన్నారు. బుధవారం హెచ్ఎంఆర్ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మెట్రో సిబ్బంది కృషివల్లే ఇప్పటివరకు నగర మెట్రో ప్రాజెక్టు 72 జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల కోసం తరుణి స్టేషన్
దూలపల్లి: నగర మెట్రో ప్రాజెక్టుల మహిళలకు కోసం ప్రత్యేకంగా ‘తరుణి’ పేరుతో మెట్రో స్టేషన్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మధురానగర్‌లో ఏర్పాటుచేసే ఈ స్టేషన్లో పూర్తి గా మహిళా ఉద్యోగులే ఉండే లా చర్యలు తీసుకుంటామన్నా రు. మహిళలకు సంబంధించి ఫ్యాషన్, గృహోపకరణాలు, దుస్తులు వంటి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉం చుతామన్నారు. విద్యార్థులు, పిల్లలకు మియాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్ల ప్రాంగణాల్లో చిన్నారులు ఆడుకునేందుకు గేమ్‌జోన్ సౌకర్యాలతోపాటు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ,పుస్తకాలు వంటివి అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మైసమ్మగూడాలో ని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో తొలిదశను 2015 మార్చి 21న ప్రారంభించనున్నట్టు చెప్పారు. 2017 నాటికి మూడు కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గం పూర్తయిన తరవాతనగరంలో మరో 200 కి.మీ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.