డీఆర్ గోయంక కళాశాలను రక్షించాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): డీఆర్ గోయంక మహిళా కళాశాలను మహిళల కోసమే శాశ్వతంగా ఉంచేలా చూడాలని మునిసిపల్ మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ పాశం నాగమణికి వినతిపత్రం అందజేశారు. ముందుగా తాలూకాఫీస్ సెంటర్లో మహిళలతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవతి పద్మావతి మాట్లాడుతూ కళాశాల ఆస్తులను పరిరక్షించాలని, కళాశాల కమి టీ చేస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాల కమిటీలోకి 50 శాతం మహిళలను తీసుకోవాలన్నారు. కళాశాల ప్రారంభానికి విరాళాలిచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు కమిటీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుం డా చూడాలని సూచించారు.