Taskin
-
తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్
దుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్లు తస్కీన్ అహ్మద్, అరాఫత్ సన్నీలకు ఐసీసీ నుంచి తీపి కబురు అందింది. బౌలింగ్ వేసేటప్పుడు వారి యాక్షన్ ఐసీసీ నిబంధనలను అనుగుణంగా లేదని ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్లో వాళ్లు బౌలింగ్ చేయకుండా గతంలో ఐసీసీ నిషేధం విధించింది. వారిద్దరికి అనేక పరీక్షలు నిర్వహించిన ఐసీసీ.. ప్రస్తుతం వారి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని తేల్చింది. దాంతో వాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేసేందుకు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా వారి బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు తలెత్తాయి. దాంతో చెన్నైలో తొలిసారి వారికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా సెప్టెంబర్ 8న బ్రిస్బేన్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం వాళ్లు బౌలింగ్ వేసేటప్పుడు తమ మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచడం లేదని తేలింది. దాంతో ఐసీసీ వారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ప్రతి మ్యాచ్ కీలకమే
సంజయ్ మంజ్రేకర్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ తిరిగి గాడిలో పడింది. పాకిస్తాన్‌పై గెలుపు భారత్‌కు అత్యంత కీలకమైంది. ఎందుకంటే టోర్నమెంట్లో నిలవాలంటే ఆ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కాబట్టి అంచనాలకు అనుగుణంగా రాణించి చక్కని విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడి నుంచి భారత్ ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. న్యూజిలాండ్‌తో ఊహించని పరాజయం తర్వాత భారత్ అదృష్టం కొద్దీ పాక్‌తో తలపడింది. చాలా మంది ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే ఈ రోజుల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కు చాలా సులువుగా మారింది. కాబట్టి తొలి ఓటమి తర్వాత టీమిండియాకు తక్షణ విజయం దక్కింది. దీంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు చాలా మెరుగుపడుతోంది. కానీ ఇద్దరు బౌలర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించడం ఆందోళనగా మారింది. తుది జట్టులో టస్కిన్ లేకపోవడం బౌలింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఆస్ట్రేలియాపై తమీమ్ ఆడకపోవడంతో తుది జట్టులో అతని ఎంపికపై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిన ఆటలో షాట్లు ఆడే సమయంలో మరింత బలం వచ్చేందుకు గాను బరువు ఎక్కువ ఉన్న బ్యాట్లను వాడినా ఎవరూ పట్టించుకోరు. కానీ అదే బౌలర్లు మోచేతిని కొద్దిగా పక్కకు వంచితే మాత్రం వేటు వేస్తున్నారు. ఒకరకంగా ఇది బౌలర్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించడమే. భారత్, బంగ్లాదేశ్‌ల మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. కాబట్టి భారత్‌కు స్పిన్ వికెట్ కాకుండా తొలిసారి మంచి బ్యాటింగ్ పిచ్ లభించనుంది. ధావన్, రోహిత్‌లకు ఇది శుభవార్త. -
తస్కిన్,సన్నీలపై నిషేధం
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీలు నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో వారిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఈ మేరకు ఆ బౌలర్ల బౌలింగ్ శైలిని పరీక్షించిన అనంతరం శనివారం ఐసీసీ ఓ నివేదిక విడుదల చేసింది. తస్కిన్, సన్నీలు తమ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచి బౌలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధంగా కావడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వీటిని దేశవాళీ లీగ్‌లు కూడా గుర్తించాలని ఐసీసీ తెలిపింది. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తస్కిన్ 14 వన్డేలు ఆడి 21 వికెట్లు తీయగా,13 టీ20ల్లో 9 వికెట్లు సాధించాడు. ఇక సన్నీ 16 వన్డేల్లో 24 వికెట్లు, 10 టీ 20ల్లో 12 వికెట్లు తీశాడు.