Tata Ace Auto
-
టీఆర్ఎస్ కార్యకర్తలను తరలిస్తున్న టాటాఏస్ బోల్తా..
-
రెప్పపాటు క్షణంలో ఘోర ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఐడీఏ బొల్లారం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. టాటా ఏస్ ప్యాసింజర్ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మీ బొల్లారంలో ఓ కార్యాలయంలో లేబర్‌గా పని చేస్తోంది. ఆమె ఇవాళ మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు తన మరిది సైదులు రెడ్డి ద్విచక్ర వాహనంపై బయల్దేరింది. వీరు వెళుతుండగా రోడ్డుపై ఆగివున్న టాటా ఏస్ డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీయడంతో ... వదినా, మరిది ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో పక్కనే వెళుతున్న టిప్పర్ కింద పడిపోవడం...వారిపై నుంచి టైర్లు వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి..
రాజేంద్రనగర్: రెడిమిక్స్ వాహనం అదుపు తప్పి మినరల్ వాటర్ సప్లే చేసేందుకు వెళ్తున్న టాటా ఏసీ ఆటోని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెడిమిక్స్ వాహనం ఆటోని ఢీకొట్టి ముందుకు ఈడ్చుకెళ్లి హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో ఆటోలోని ఇరువురు ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్తంభాన్ని ఢీకొట్టకుండా అలాగే వెళ్లి ఉంటే పక్కనే ఉన్న గుడిసెలపై పడి మరింత ప్రాణ నష్టం సంభవించేది. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట మూవీ టవర్స్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి ఖానాపూర్ వెళ్లేందుకు మూవీ టవర్స్ మీదుగా రెడిమిక్స్ వాహనం బుధవారం రాత్రి వెళ్తుంది. రోడ్డు నిటారుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇందులోని వాటర్ సప్లే చేసే వట్టినాగులపల్లికి చెందిన అనిల్‌కుమార్(27), హేమంత్‌రెడ్డి(30) ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. రెడిమిక్స్ డ్రైవర్ వాహనంలోని ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ రవికుమార్, నార్సింగి ఇన్స్పెక్టర్ నారాయణగౌడ్‌లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్లినర్ సైతం తీవ్రగాయాలకు గురయ్యారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలివచ్చారు. సహాయక చర్యల్లో పోలీసులకు సహకరించారు. తప్పిన పెను ప్రమాదం... రెడిమిక్స్ వాహనం రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దాటికి స్తంభం పక్కకు ఒరిగింది. స్తంభానికి ఉన్న ఒక వైరు మాత్రం తెగి కిందపడింది. స్తంభం పూర్తిగా కింద కు పడి వైర్లు పడిఉంటే మరింత ప్రమాదం చోటు చేసుకునేది. సంఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. రెడిమిక్స్ వాహనాలను నిషేధించండి... రెడిమిక్స్ వాహనాల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు బుధవారం రాత్రి పోలీసుల ఎదుట వాపోయారు. ప్రతి రోజు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుందన్నారు. రెడిమిక్స్ వాహనాలు అదుపు తప్పి తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని నిషేధించాలని వెల్లడించారు. కేవలం రాత్రి 10 గంటల అనంతరం మాత్రమే అనుమతించాలని పోలీసులను కోరారు. -
బైక్‌ను ఢీకొట్టిన టాటా ఏస్.. ఒకరి మృతి
సాక్షి, కరీంనగర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని రామడుగు మండలం వెదిర వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
వ్యవసాయ కూలీల ఆటో బోల్తా
దగ్గుబాడు (కారంచేడు) : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కన పంట కాలువలో బోల్తా కొట్టడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఆదే గ్రామానికి చెందిన దాసరి నరసింహారావు టాటా ఏస్ ఆటోలో కూలి పనుల కోసం దగ్గుబాడు వైపు వెళ్తున్నారు. పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ఆటోకు కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ఆటో సైడ్ ఇవ్వబోయి మార్జిన్లో దిగి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు తిరుమలశెట్టి నర్సమ్మ, నీరుకట్టు సుందరరావమ్మ, లక్కాకుల సుబ్బులు, గొనసపూడి రాముడు, ఇళ్ల అరుణ, తిరుమలశెట్టి పుష్పావతి, రమాసుందరి, భూపతి సామ్రాజ్యం, బండి సోని, చింతపల్లి వరలక్ష్మి, గలబ కోటేశ్వరమ్మలకు గాయాలయ్యాయి. దగ్గుబాడు సర్పంచ్ ముల్లా నూర్‌అహ్మద్, పోతినివారిపాలెం సర్పంచ్ ధర్మా 108 సిబ్బందికి సమాచారం అందించారు. పర్చూరు, చీరాలకు చెందిన 108 వాహనాల్లో క్షతగాత్రులను చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి తల, నడుము, చేతులు, కాళ్లు, ఛాతీ భాగాల్లో పైకి కనిపించని దెబ్బలు తగిలాయని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు నీరుకట్టు వాసుబాబు, సర్పంచ్ కట్టా లక్ష్మణబాబు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.