టాటా -బోయింగ్ సంస్థకు నేడు రక్షణ మంత్రి పరీకర్
♦ పునాదిరాయి శంకుస్థాపనకు
♦ హాజరుకానున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
♦ వైమానిక రంగానికి కేంద్రబిందువుగా జిల్లా
13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు దేశ వైమానికరంగానికి తలమానికంగా మారనుంది.
ఇప్పటివరకు సికోర్‌స్కై, లుకుడ్ మార్టిన్ సంస్థతో కలిసి సీ-130జే ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల కేబిన్లను తయారు చేస్తుండగా తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి విమానయాన సంస్థ బోయింగ్ కూడా జత కలవడంతో ఏరోస్పేస్ హబ్‌గా జిల్లా పేరు మార్మోగనుంది.
గగనతలంలో ఠీవిగా ఎగిరే బోయింగ్ విమాన తయారీకి మన జిల్లా.. కేంద్రం కానుంది. అమెరికాకు చెందిన బోయింగ్ విమానాల విడిభాగాల తయారీకి ఆదిబట్ల వేదికకానుంది. ఇప్పటికే వైమానిక రంగానికి చిరునామాగా నిలి చిన ‘టాటా ఏరో స్పేస్‌జోన్’లో దేశంలోనే ప్రప్రథమంగా ఈ బోయింగ్ విమానాల తయారీ కేంద్రం నెల కొల్పుతుండడం విశేషం. టాటా -బోయింగ్ కంపెనీలు సంయుక్తంగా నెలకొల్పుతున్న ఈ సంస్థకు శనివారం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ పునాదిరాయి వేయనున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దివంగత సీఎం వైఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో ‘టాటా ఏరో స్పేస్ జోన్’ ప్రకటించడంతో ఆదిబట్ల రూపురేఖలే మారిపోయాయి. అదేసమయంలో టీసీఎస్, కాగ్నిజెంట్లాంటి ఐటీ సంస్థలు కొలువుదీరడంతో రియల్‌కు రెక్కలొచ్చా యి. ఇవేకాకుండా సమూహ తదితర సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో
నగరీకరణ విస్తృతంగా పెరిగింది. మరోవైపు ఆదిబట్ల ఏరోస్పేస్ జోన్‌కు కొనసాగింపుగా సమీపంలోని ఎలిమినేడులో కూడా ఏరోపార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీగా భూ సమీకరణ చేపడుతోంది. దాదాపు ఐదారు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ జోన్లో.. అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన విమానరంగ తయారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోయింగ్ విమాన కేబిన్ల తయారీ కంపెనీకి శనివారం రక్షణమంత్రి పరీకర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంకురార్పణ చేయనుండడంతో త్వరలోనే ఆదిబట్ల పేరు విశ్వవ్యాప్తం కానుంది.